గుర్రంపై వచ్చి, బల్లలపైకి ఎక్కి.. రెస్టారెంటులో వ్యక్తి హంగామా (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

టెక్సాస్: టెక్సాస్‌లోని విక్టోరియాలో ఉన్న వాటర్‌బర్గ్ రెస్టారెంట్‌కు ఒక వ్యక్తి గుర్రంపై వచ్చాడు. రెస్టారెంటులోకి వచ్చీ రాగానే గుర్రాన్ని నేరుగా రెస్టారెంట్‌లోకి తీసుకు వెళ్లాడు.

అప్పటికే అతడు గుర్రంపై కూర్చోని ఉన్నాడు. అలాగే రెస్టారెంట్ లోపలికి వెళ్లాడు. రెస్టారెంట్ సిబ్బంది అతడిని అడ్డుకోబోయారు. కానీ అతడు అలాగే లోనికి వెళ్లాడు. అంతేకాదు, అతను రెస్టారెంట్ బల్లలపై డ్యాన్స్ చేశాడు. కొందరు ఫోటోలు, వీడియోలు తీశారు.

దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాసేపటికి అవి వైరల్ అయ్యాయి. అయితే రెస్టారెంట్ యజమాని ఇలా చేయించి ఉంటాడని మొదట అందరూ భావించారు. కానీ, అతడెవరో తమకు తెలియదని సిబ్బంది చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An unidentified man in a cowboy hat and cowboy boots rode a horse into a Whataburger restaurant and started dancing on tables Saturday night in Victoria, Texas.
Please Wait while comments are loading...