వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాత్రూంలోకి వచ్చిన కొండచిలువ: మహిళను చుట్టేసి..

|
Google Oneindia TeluguNews

బ్యాంకాక్: ఓ మహిళ స్నానం చేసి బాత్రూం నుంచి బయటికి వస్తుండగా ఓ పెద్ద కొండచిలువ ఆమె పైకి దూసుకొచ్చింది. ఆమె కుడి చేతిని గట్టిగా చుట్టుకుని ఆమెను కిందపడేసేందుకు ప్రయత్నించింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ సాయం కోసం కేకలు వేసింది.

ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని సామ్కోక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కొండచిలువ పైకి ఎక్కడంతో దగ్గరలో ఉన్న చీపురుతో దాన్ని తరిమికొట్టేందుకు ఆ మహిళ రాంపౌంగ్ ఓన్లమాయి(57) ప్రయత్నించింది. ఆమె వల్ల సాధ్యం కాకపోవడంతో సాయం కోసం గట్టిగా కేకలు వేసింది.

ఇంట్లో ఉన్న ఆమె కూతుళ్లు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ కొండచిలువ బారి నుంచి ఆమెను రక్షించారు. ఆ తర్వాత కొండచిలువ దాడిలో గాయపడ్డ ఓన్లమాయిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Thai woman hospitalised after python attacks her in shower

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ పొడవాటి పెద్ద కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి పెద్ద కొండచిలువలు ఉప సహారా, ఆఫ్రికా, నేపాల్, ఇండియా, శ్రీలంక, బర్మా, దక్షిణ చైనా, ఆగ్నేసియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, న్యూగినియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో సంచరిస్తుంటాయని అధికారులు చెప్పారు.

అమెరికాలోని యునైటెడ్ స్టేట్స్‌లోని ఎవర్‌గ్లాడ్స్ నేషనల్ పార్క్‌లో 1990లలో ఈ రకమైన బర్మీస్ కొండచిలువలు అధికంగా ఉండేవని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.

English summary
Rampeung Onlamai, 57, of Samkok, Thailand, was getting out of the shower when the huge snake sank its fangs into her right hand and attempted to drag her down the drain, according to mirror.co.uk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X