వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మడేలిన్ ఆల్బ్రైట్ కన్నుమూత - బాల శరణార్ధిగా వచ్చి : అమెరికా తొలి మహిళా సెక్రటరీగా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

అమెరికా మొదటి మహిళా సెక్రటరీ మడేలిన్ ఆల్బ్రైట్ కన్నుమూశారు. ఆల్బ్రైట్ వయసు 84 ఏళ్లు. మడేలిన్ ఆల్బ్రైట్ బాల శరణార్థిగా అమెరికాకు వచ్చారు. 20వ శతాబ్దం చివర్లో అమెరికా విదేశాంగ విధానాన్ని రూపొందించి తొలి మహిళా సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఎదిగారు. తొలి మహిళా దౌత్యవేత్తగా క్రియాశీలకంగా వ్యవహరించారు. మడేలిన్ ను యునైటెడ్ నేషన్స్‌కు రాయబారిగా అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ నియమించారు. యూఎస్ అగ్ర దౌత్యవేత్తగా ఆల్బ్రైట్ సమర్ధవంతంగా పనిచేశారు. విదేశాంగా కార్యదర్శిగా కొసావోలో నాటో విస్తరణ విషయంలో కీలకంగా వ్యవహరించారు.

ఆల్బ్రైట్ మరణం పైన అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ఆల్బ్రైట్ చరిత్ర ఎన్నో ఆటు పోట్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని కొనియాడారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పనిచేసిన మడేలిన్ మృతి ప్రపంచానికి తీరని లోటని అమెరికా మాజీ అధ్యక్షుడు క్లింటన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. 1937 వ సంవత్సరం మే మే 15వతేదీన చెకోస్లోవేకియాలో మేరీ జానా కోర్బెలోవాగా జన్మించిన ఆల్బ్రైట్ 1948లో తన కుటుంబంతో కలిసి శరణార్థిగా అమెరికాకు వచ్చి 1957లో యూఎస్ పౌరసత్వం పొందారు.

The first female US secretary of state, Madeleine Albright has died at the age of 84

ఆమె తండ్రి జోసెఫ్ కోర్బెల్ దౌత్యవేత్త. 1997లో స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు అధిపతిగా ఆల్‌బ్రైట్‌ను క్లింటర్ నియమించారు. యునైటెడ్ స్టేట్స్ ఏకైక సూపర్ పవర్‌గా అవతరించిన ప్రచ్ఛన్న యుద్ధం తరువాత ప్రపంచంలో ఆల్బ్రైట్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు సారథ్యం వహించారు. ఆల్బ్రైట్ కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అగ్రరాజ్యం లో ఇలాంటి ఉన్నత పదవులు చేపడుతానని ఏనాడు భావించ లేదని తన చివరి ఇంటర్వ్యూలో ఆల్బ్రైట్ పేర్కొన్నారు.

English summary
Madeleine Albright, who came to the United States as a child refugee and rose to be the first female secretary of state, has died at the age of 84.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X