Maldives: చైనా అండతో రెచ్చిపోతున్న మాల్దీవ్ ప్రభుత్వం.. !
భారత ప్రధానిపై మాల్దీవుల మంత్రులు చేసిన పోస్టుల నుంచి ఆ దేశంతో సంబంధాలు క్షీణిస్తున్నాయి. తాజాగా మాల్దీవుల దేశానికి చెందిన బోట్లను భారత్ బలగాలు అడ్డుకున్నాయని ఆ దేశం ఆరోపించింది. ఇందుకు సంబంధించి సమగ్ర వివరాలను అందించాలని భారత ప్రభుత్వాన్ని అధికారికంగా అభ్యర్థించింది. మాల్దీవులలో గత ఏడాది నవంబర్‌లో చైనా అనుకూల నేతగా మొహమ్మద్ మయిజ్జూ అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం తలెత్తుతున్నాయి.
జనవరి 31న మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) పరిధిలో ఫిషింగ్ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్న మాల్దీవుల ఫిషింగ్ బోట్‌ను భారత సైన్యం అడ్డగించిందని మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ధిద్ధూ, హా అలీఫు అటోల్‌కు ఈశాన్యంగా 72 నాటికల్ మైళ్ల దూరంలో ఉందని చెప్పింది. సంబంధిత అధికారులతో ముందస్తు సంప్రదింపులు లేకుండానే భారత సైనికులు మాల్దీవుల ఇఇజెడ్‌లో మూడు ఫిషింగ్ బోట్లలో ఎక్కారని, తద్వారా అంతర్జాతీయ సముద్ర చట్టాలు, నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించింది.

ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 246, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ 253కి చెందిన బోర్డింగ్ టీమ్‌లు బోట్ లను అడ్డగించినట్లు పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ప్రెసిడెన్షియల్ రన్-ఆఫ్‌లో 45 ఏళ్ల ముయిజ్జు అధికారం చేపట్టారు. భారత్‌కు అనుకూలమైన అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌ను మయిజ్జు ఓడించాడు. ముయిజ్జు ప్రెసిడెంట్ అయిన తర్వాత తమ దేశం నుంచి 88 మంది సైనిక సిబ్బందిని ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని అధికారికంగా అభ్యర్థించారు.
ప్రస్తుతం దాదాపు 80 మంది భారతీయ సైనిక సిబ్బంది మాల్దీవుల్లో ప్రాథమికంగా రెండు హెలికాప్టర్లు, వందలాది వైద్య తరలింపులు, మానవతా కార్యకలాపాలను నిర్వహించే ఒక విమానాన్ని ఆపరేట్ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ముగ్గురు మంత్రులు చేసిన అవమానకరమైన సోషల్ మీడియా పోస్ట్‌ల తర్వాత అక్కడి ప్రభుత్వం భారతదేశంతో దౌత్యపరమైన వివాదంలో చిక్కుకుంది.












Click it and Unblock the Notifications