North Korea: ఉత్తర కొరియాలో దారుణం.. రెండేళ్ల బాలుడికి జీవిత ఖైదు విధింపు..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. US స్టేట్ డిపార్ట్‌మెంట్ నివేదిక ప్రకారం ఉత్తకొరియాలో క్రైస్తవులపై కిమ్ అకృత్యాలకు పాల్పడుతున్నారు. క్రైస్తవులు బైబిల్ తో కనిపిస్తే అక్కడ శిక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల బాలుడు బైబిల్ తో కనిపించాడని.. అతనికి జీవిత ఖైదు విధించారు. ఇప్పటి వరకు ఉత్తర కొరియాలో 70,000 మందికి పైగా క్రైస్తవులు శిక్ష విధించారు. ఈ విషయాన్ని US స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ వెల్లడించింది.

ఈ నివేదికలో ఉత్తర కొరియాలో ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి దారుణాలకు పాల్పడుతోంది పేర్కొంది. ఉత్తర కొరియా ప్రభుత్వం మతపరమైన ఆచారాలలో పాల్గొనే, మతపరమైన వస్తువులను కలిగి ఉన్న, మతపరమైన వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్న లేదా మత విశ్వాసాలను పంచుకునే వ్యక్తులను హింసిస్తుందని తెలిపింది. మతపరమైన కార్యకలాపాలకు యత్నించినందుకు గానూ అనేక మంది క్రైస్తవులను అరెస్టు చేసి పొలిటికల్‌ జైలు శిబిరాలకు తరలించారని నివేదిక వివరించింది.

 North Korean

151 మంది క్రైస్తవ మహిళలతో ఇంటర్వ్యూల ఆధారంగా, కొరియా ఫ్యూచర్ 2021లో మహిళలపై మతపరమైన స్వేచ్ఛను దుర్వినియోగం చేసినట్లు నివేదించిన నివేదికను కూడా విడుదల చేసింది. మత గ్రంథాన్ని కలిగి ఉండటం, మతపరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో 2009లో ఆ చిన్నారి కుటుంబాన్ని అరెస్టు చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. బాలుడి కుటుంబ సభ్యులకు కూడా జీవిత ఖైదు విధించారట. 2021 డిసెంబరులో కొరియా ఫ్యూచర్‌ అనే ఓ లాభాపేక్ష లేని సంస్థ కూడా కిమ్‌ ఆగడాలపై ఓ నివేదిక విడుదల చేసింది. మతస్వేచ్ఛను కోరుకునే వారు అత్యంత తీవ్రమైన వేధింపులను ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది.

ఉత్తర కొరియా తన రాజ్యాంగంలో తన ప్రజలకు మతపరమైన స్వేచ్ఛను అధికారికంగా హామీ ఇచ్చినప్పటికీ అక్కడి ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుటుంది. ఉత్తర కొరియా మాన హక్కులను హరిస్తుందని పలు స్వచ్ఛంద సంస్థలు ఆరోపిస్తున్నాయి. దీనిపై ప్రపంచ దేశాలు స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+