Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kim-Jong-Un: రైలులో రష్యాకు కిమ్ మామ: ఈ ట్రైన్ ఫీచర్స్ కిర్రాక్ గురూ..!

సాధారణంగా దేశాధ్యక్షులు మరో దేశానికి వెళ్లాలంటే ఎలా వెళతారు..? ప్రభుత్వ విమానంలో వెళతారు. అంతేకదా. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం రైలులోనే వెళతారు. ఇదేంటి దేశం దాటి మరో దేశానికి రైలులో వెళ్లడమేంటి.. ఇదేం విడ్డూరం అనుకుంటున్నారా.. అవును కిమ్ మామ రూటే సపరేటు. అసలు విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

కిమ్ జాంగ్ ఉన్.. చూసేందుకు పొట్టిగా ఉన్న అగ్రరాజ్యాలకు నిద్ర లేకుండా చేసేంత గట్టివాడు. దేశం ఒక చిన్న దీవికే పరిమితమైనా.. మాకేం తక్కుత తగ్గేదేలే అనే కాన్ఫిడెన్స్ అతనిలో ఎప్పుడూ కనిపిస్తుంది. ఇక కిమ్ జాంగ్ ఉన్ ఏం చేసినా వార్తే అవుతుంది. అది కూడా చాలా స్పెషల్ వార్తే అవుతుంది. తాజాగా కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్ష హోదాలో రష్యా పర్యటనకు వెళ్లాడు. అయితే విమానంలో కాదండోయ్...రైలులో. రైలులో రష్యాకా.. ఇదేం పైత్యం అనుకుంటున్నారా.. చెప్పాంగా.. మనోడిది అంతా వెరైటీ అని. ఇంతకీ ఈ ట్రైన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.

The Red Carpet Ride: Kim Jong Uns Luxurious Bulletproof Train in Russia

ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి కిమ్ జాంగ్ ఉన్ రష్యా పర్యటనకు వెళ్లాడు. రష్యాకు వెళ్లేందుకు తనకిష్టమైన రైలు ప్రయాణంను ఎంచుకున్నాడు. మొత్తం 1000కిలో మీటర్లకు పైగా ప్రయాణించి రష్యా చేరుకునేందుకు 20 గంటల సమయం పట్టింది. ఇక ఆ రైలు ఫీచర్స్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. మరి కిమ్ మామానా మజాకా..ఇంతకీ ఈ రైలులో ప్రత్యేకతలేంటో ఓ సారి చూద్దాం. ఈ రైలు మొత్తం బుల్లెట్ ప్రూఫ్. 2011లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఉత్తరకొరియా నుంచి విదేశాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణమే ఎంచుకుంటారు. తన తండ్రి తాత కూడా రైలులోనే ప్రయాణించేవారట.

ఇక రైలు విషయానికొస్తే 21 బోగీలతో ఉంటుంది.ఆలివ్ గ్రీన్ కలర్‌‌లో కనిపించే ఈ రైలులోనే ప్రయాణించేందుకు ఈ నియంత ఎందుకు ఎంచుకున్నాడనేదే ఇప్పుడు చాలామందిలో తొలుస్తున్న ప్రశ్న. ఇక ఉత్తరకొరియా అధ్యక్షులు విదేశాలకు వెళ్లాలంటే రైలులోనే వెళ్లాలనేది పూర్వీకుల నుంచే ఒక సాంప్రదాయంగా వస్తోంది.ఉత్తరకొరియా వ్యవస్థాపకులు కిమ్ జాంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్ 1950-1953 మధ్య జరిగిన కొరియా యుద్ధం సమయంలో రైలులోనే ప్రయాణించాడు. తాను అధ్యక్షుడయ్యాక కూడా ఇదే పద్ధతిని అనుసరించాడు. అనంతరం కిమ్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ కూడా రైలులోనే ప్రయాణించ సంప్రదాయాన్ని కొనసాగించాడు.

The Red Carpet Ride: Kim Jong Uns Luxurious Bulletproof Train in Russia

బీబీసీ ప్రకారం కిమ్ జాంగ్ ఇల్ 2011 డిసెంబర్‌లో ఇదే రైలులో ప్రయాణిస్తుండగా గుండెపోటుతో మరణించాడు.ఇక ఆ తర్వాత అధ్యక్షుడైన కిమ్ జాంగ్ ఉన్ కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాడు. చాలా అరుదుగా విమాన ప్రయాణం చేస్తాడు. ఉదాహరణకు 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసేందుకు ఎయిర్ చైనా విమానంలో కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణించాడు. అయితే ఈ రైలు గురించి చాలా విషయాలు లేదా రహస్యాలు బయట ప్రపంచానికి తెలియవు.

కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణించే రైలులోని ప్రతి బోగీ బుల్లెట్ ప్రూఫ్‌ కలిగి ఉండటంతో దీని బరువు చాలా ఎక్కువగా ఉంటుందట. అందుకే దీని వేగం గంటకు 59.5 కిలో మీటర్లే ఉంటుందట.ఇక ఈ రైలు ప్రయాణించే సమయంలో గాల్లో హెలికాఫ్టర్‌ లేదా విమానం సెక్యూరిటీగా ఉంటుందట. అంతేకాదు ఈ రైలులోనే అత్యంత భద్రతతో కూడిన మెర్సీడీస్ కార్లు రెండు ఉంటాయట. ఇది కిమ్ ప్రయాణించేందుకు .ఇక బోగీలోపల గదులు, కాన్ఫరెన్స్ హాల్స్ అత్యంత విలాసవంతంగా ఉంటాయట.ఇక కిమ్ విమానంలో ఎందుకు ప్రయాణించరో కూడా ఒక కారణం ఉంది. తనపై ఎవరైనా హత్య చేస్తారేమో అనే భయం అతన్ని వెంటాడుతుందట. వాస్తవానికి తన తాత తండ్రికి కూడా ఇదే భయం ఉండేదని చెబుతుంటారు. మొత్తానికి కిమ్ జోంగ్ ఉన్ రైలు గురించి ఇంకా చాలా రహస్యాలు బయట ప్రపంచానికి తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+