Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్-అమెరికా డీల్ తో రష్యా చమురుకు బ్రేక్ పడదా ? ఏంటీ లెక్క..?

అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుుదుర్చుకున్న భారత్.. ఇప్పటికిప్పుడు రష్యా చమురు దిగుమతుల్ని నిలిపేసే అవకాశాలు లేవు.

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత సర్వత్రా వినిపిస్తున్న ప్రశ్న.. దశాబ్దాల నాటి మిత్రదేశం రష్యా(russia)ను అంత తేలిగ్గా ఎందుకు మన దేశం వదిలేసుకుంటోందని. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా భారత్ లో ప్రభుత్వాలు మారుతున్నా నిరాటంకంగా సాగిన రష్యా చమురు దిగుమతుల్ని ఇప్పుడు ట్రంప్ మాట విని మోడీ హఠాత్తుగా రాత్రికి రాత్రి నిలిపేస్తున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే అక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

భారత్ కు రష్యా చమురు

గతంలో ఉక్రెయిన్ పై రష్యా యుద్దం మొదలుపెట్టాక ఆర్ధిక ఇబ్బందుల్లో పడింది. దీంతో అప్పటికే భారత్ కు విక్రయిస్తున్న చమురు సరఫరాను మరింత పెంచుకునేందుకు డిస్కౌంట్ ఆఫర్లు ఇచ్చింది. వీటిని భారత్ కూడా అంగీకరించి భారీ ఎత్తున ఆయిల్ కొనడం మొదలుపెట్టింది. ఇది కాస్తా అమెరికాకు మంటపుట్టించింది. దీంతో రష్యా నుంచి భారీ డిస్కౌంట్ తో ఆయిల్ కొంటూ ఉక్రెయిన్ యుద్దానికి ఊతమిస్తున్నారంటూ భారత్ పై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించారు.

The Russia Oil Test Can India Afford to Stop Buying after US Trade Deal

అమెరికా డీల్ తో రష్యాకు చెక్ కష్టమేనా ?

అయితే ఇప్పుడు తాజాగా కుదిరిన డీల్ ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతుల్ని భారత్ అపేయాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే తప్పనిసరిగా ట్రంప్ చెప్పిన వెనెజులా నుంచి ఖరీదైన చమురు కొనాల్సి ఉంటుంది. దీంతో ఈ విషయంలో భారత్ ప్రస్తుతానికి మధ్యేమార్గం అనుసరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ పై ముందుగానే సమాచారం ఉండటంతో రష్యాకు చమురు ఆర్డర్లను ఏప్రిల్ వరకూ కేంద్రం ఇచ్చేసింది.

భారత్ వ్యూహమిదే..!

వాస్తవానికి భారత్ తన ముడి చమురు అవసరాలలో 85-88 శాతం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. రష్యా ఇందులో ఎప్పుడూ కీలక సరఫరాదారుగా ఉంది. భారతీయ రిఫైనరీల అవసరాలకు సరిపోయే రాయితీ ధరలకు తరచుగా ముడి చమురును రష్యా అందిస్తోంది. అలాగే చమురు ఒప్పందాలు సాధారణంగా వారాల నుండి నెలల ముందుగానే జరుగుతాయి. భారతీయ రిఫైనరీలు ఇప్పటికే మార్చి లేదా ఏప్రిల్ వరకు రష్యా చమురును బుక్ చేసుకున్నాయి. ప్రభుత్వం కోరినా, ప్రస్తుతం చేసుకున్న ఒప్పందాలతో వెంటనే కొనుగోళ్లను నిలిపివేయడం సాధ్యం కాదు. అలాగే బుక్ చేసిన సరుకులను ఆర్థిక నష్టాలు, జరిమానాలు లేకుండా అంత తేలికగా రద్దు చేయడం కష్టం.

The Russia Oil Test Can India Afford to Stop Buying after US Trade Deal

కీలక సమీకరణాలు

అంతేకాదు, రష్యన్ యురల్స్ ముడి చమురు అనేక భారతీయ రిఫైనరీలకు భౌతికంగా, ఖర్చు పరంగా అనుకూలం. తేలికపాటి యూఎస్ గ్రేడ్‌లు లేదా ఇతర వనరులు అదనపు మిశ్రమం, ప్రాసెసింగ్ లేకుండా దీనికి ప్రత్యామ్నాయం కాలేవు. ప్రభుత్వ, పరిశ్రమల అధికారులు చెప్పినట్లు భారత్ ఆర్థిక లాభాన్ని బట్టే చమురు కొనుగోలు చేస్తుంది. ఆంక్షలు, వ్యూహాత్మక అవసరాలకు లోబడినా, రష్యా దిగుమతులకు నిషేధం విధించే ఆదేశాలు మాత్రం ఇవ్వదు. అలాగే ఇప్పటికే భారత్ తన ముడి చమురు దిగుమతుల వనరులను ఇప్పటికే వైవిధ్యపరుస్తోంది. ఈ ప్రక్రియ మరింత వేగవంతం కావచ్చు. విస్తృత ఇంధన, వాణిజ్య వ్యూహాలలో భాగంగా అమెరికా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, వెనిజులా నుండి కొనుగోళ్లను పెంచుతోంది. వాణిజ్యపరంగా లాభదాయకమైతే వెనిజులా చమురు దిగుమతులను పునరుద్ధరించడానికి భారత్ సై అంటోంది. రష్యా చమురుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అమెరికా అధికారులు ఈ ప్రయత్నాన్ని సమర్థించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+