‘‘నా భర్త పక్కనుండగానే ఆయన నాతో అలా.. సిగ్గుతో చితికిపోయా..’’

తాను కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌.డబ్ల్యూ. బుష్‌ వెకిలి చేష్టల బాధితురాలినేనంటూ బ్రిటిష్‌ సంతతి రచయిత్రి క్రిస్టియానా బేకర్‌ క్లైన్‌ వెల్లడించారు.

వాషింగ్టన్‌: తాను కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌.డబ్ల్యూ. బుష్‌ వెకిలి చేష్టల బాధితురాలినేనంటూ బ్రిటిష్‌ సంతతి రచయిత్రి క్రిస్టియానా బేకర్‌ క్లైన్‌ వెల్లడించారు.

సీనియర్ బుష్ వివిధ సందర్భాలలో తనను కలిసిన కొంతమంది మహిళలతో చేసిన వెకిలి చేష్టలు ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. బుష్‌ అసభ్య ప్రవర్తన గురించి 2014లోనే నటీమణి హీతర్‌ లిండ్‌ వెలుగులోకి తెచ్చారు.

ఆ తరువాత 2016లో మళ్లీ ఒకసారి జోర్డానా గ్రోల్నిక్‌ అనే నటీమణి కూడా కొన్ని రోజుల కిందట పూసగుచ్చారు. తాజాగాబ్రిటిష్‌ సంతతి రచయిత్రి క్రిస్టియానా బేకర్‌ క్లైన్‌ నాటి చేదు అనుభవాన్ని బయటపెట్టారు.

Third woman accuses George H.W. Bush of groping: ‘I was asked to be discreet’

'అమెరికా మాజీ అధ్యక్షుడు పక్కన నిలబడి ఆయన చేష్టకు సిగ్గుతో చితికిపోయానంటూ..' బేకర్‌ క్లైన్‌ పేర్కొన్నారు. 2014లో బుష్‌ భార్య బార్బారా బుష్‌ నిర్వహించిన ఓ సాహిత్య కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆమె వివరించారు.

'కార్యక్రమంలో ఫొటో కోసం వీల్‌ చైర్‌లో ఉన్న బుష్‌కు నేను, నా భర్త చెరోవైపు నిలబడ్డాం. ఇంతలో బుష్‌ నా వెనుక నుంచి చేయి వేసి నా పిరుదులను గట్టిగా నొక్కారు. ఆయన ఇలా చేస్తారని నేను ఊహించలేదు. సిగ్గుతో చితికిపోయా.. నా భర్త ఎక్కడ గమనిస్తాడో అని భయాందోళనకు గురయ్యా.. ' అంటూ క్లైన్ నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+