• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆమె సంకల్పమే ఆమెకు ఆయువు : 32 ఏళ్లుగా మంచానికే పరిమితమై అద్భుతాలు సృష్టించింది

|

సాధారణంగా మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఒక్కరోజు కూడా ఉండలేము. ఇంట్లోనే గంటల తరబడి కూర్చోవాలంటే అది సాధ్యపడే పనికాదు. ఎంతో బోర్‌గా కూడా ఫీలవుతాం. అలాంటిది చైనాకు చెందిన ఓ మహిళ 32 ఏళ్లుగా ఇంట్లోనే గడుపుతోంది. అది కూడా మంచంపైనే ఉంటోంది. ఇక ఆవిడ పరిస్థితి మనం ఊహించగలమా....

చైనాకు చెందిన జాంగ్ జున్లీ గత 32 ఏళ్లుగా ఆర్థ్రిటిస్ వ్యాధితో బాధపడుతూఉంది. అప్పటి నుంచే ఆమె మంచానికే పరిమితమైంది. అయితేనేమీ ఆమె సంకల్పం ముందు ఈ వ్యాధి చిన్నబోయింది. ఇప్పుడు 40 ఏళ్లున్న జాంగ్ జున్లీ అందమైన బొమ్మలు వేస్తూ కాలం గడుపుతోంది. పడకమీద నుంచే ఆమె కుంచె నుంచి అధ్భుతమైన చిత్నాలు వచ్చాయి. ఆమెకు ఎనిమిదేళ్లు వచ్చేసరికే జున్లీ శరీరంలోని 90 శాతం కీళ్ల భాగాలు పనిచేయడం మానేశాయి. అయితే ఎప్పుడూ ఆమె నిరత్సాహ పడలేదు. ఆత్మవిశ్వాసంతోనే ఇంతకాలం బతికింది. అదే ఆత్మవిశ్వాసం ఆమెకు ఊపిరిగా నిలిచింది. ఇంకా ఏదైనా సాధించాలనే తపన ఆమెలో మరింత బలపడింది.

This Chinese lady is an inspiration to all..check out

"ప్రపంచం ఎంతో సుందరమైనది. నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈ అందమైన ప్రపంచంలో జీవించే అవకాశం ఉన్నందున ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను" అంటూ చెబుతోంది జాంగ్. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే జున్లీ ఇప్పటివరకు 300కు పైగా పెయింటింగ్స్ వేసింది. అంతేకాదు లిల్లీస్ ఈసెల్ పేరుతో ఓ ఆన్‌లైన్ షాపింగ్ కూడా సొంతంగా నిర్వహిస్తోంది. పెయింటింగ్ తన జీవితాన్ని మార్చేసిందని చెబుతోంది. మొదటి సారిగా తను కుంచె పట్టుకున్నప్పుడు తనలో ఏదో తెలియని అనుభూతి కలిగిందని చెప్పిన జాంగ్... తను అద్భుతమైన బొమ్మలు గీసేందుకే ఇంకా బతికి ఉన్నట్లు తెలిపింది. దృఢమైన సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి జాంగ్ నిదర్శనం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని చైనా వార్తలుView All

English summary
Many of us can't stay at home just sitting idle.We feel bored and we know how difficult it is. But when we see people like Zhang Junli, our worries fade into oblivion. Junli, hailing from China has been battling rheumatoid arthritis in bed for 32 years.That's didn't stop this brave 40-year-old woman to pick up some paint and canvas and create amazing pieces of art.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more