వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రంలో మునిగిపోనున్న అలస్కాలోని గ్రామం

By Srinivas
|
Google Oneindia TeluguNews

అలస్కా: వాతావరణ మార్పుల కారణంగా మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. ఎన్నో మార్పులు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా అలస్కాలోని కివలిన గ్రామం త్వరలో సముద్రంలో మునిగిపోనుందని చెబుతున్నారు.

పచ్చని చెట్లతో కళకళలాడిన అమెరికాలోని అలస్కా రాష్ట్రంలోని ఈ కివలిన గ్రామం ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోనుందని హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు సముద్ర మట్టానికి 400 అడుగుల ఎత్తులో ఉంది. ఇప్పుడు కేవలం ఎనిమిది నంచి పది అడుగుల దూరానికి చేరింది.

This is climate change: Alaskan villagers struggle as island is chewed up by the sea

చుట్టూ నీరు ఉన్న ఈ గ్రామం, 2025 నాటికి సముద్రం గర్భంలో కలిసిపోనుందని చెబుతున్నారు. ఇటీవల అమెరికా ఆర్మీ పటాలం ఇంజినీర్లు ఈ విషయం చెప్పారు. ఆర్కిటెక్ వలయానికి 83 మైళ్ల దూరంలోని దీవిలో ఆ గ్రామం ఉంది. ప్రస్తుతం ఈ గ్రామంలో నాలుగు వందలకు పైగా జీవిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఆ గ్రామం మునిగిపోతుందనే కారణంతో అలస్కా ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చర్యలను తగ్గించింది. ఒకప్పుడు ఇక్కడ పండ్ల తోటలు, తిమింగళాల వేటపై బతికిన ప్రజలు నేడు ఒడ్డుకు వచ్చే సీల్స్ పైన ఆధారపడి బతుకుతున్నారు. కొందరు అలస్కాకు వలసపోయారు. కొందరు ఎటు వెళ్లలేక ఉండిపోయారు.

English summary
This is climate change: Alaskan villagers struggle as island is chewed up by the sea
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X