పిట్టకొంచెం..కూత ఘనం: ఈ అక్కాచెల్లెళ్ల మెదడు ఐన్‌స్టీన్ కంటే షార్ప్

లండన్: ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ కవలల పేర్లు నిష్కా, నైసా. ఇద్దరూ భారత సంతతికి చెందిన వారు. ఇంతకీ వీరు సాధించిన ఘనత ఏమిటో తెలుసా... ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత మేధావులుగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్ మేధాశక్తినే ఈ అమ్మాయిలు అధిగమించారు. బ్రిటన్‌కు చెందిన ఈ అక్కా చెల్లెళ్లు మెన్సా ఐక్యూ టెస్టులో ఏకంగా 162 పాయింట్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు.

చిన్నారుల్లో తెలివితేటలు గుర్తించేందుకు మెన్సా ఐక్యూ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 140 పాయింట్లు కనుక సాధిస్తే వారిని అపరమేధావిగా గుర్తిస్తారు. అలాంటిది ఈ కవలలు ఏకంగా 162 పాయింట్లు సాధించి వావ్ అనిపించారు. స్టీఫెన్ హాకింగ్, ఐన్‌స్టీన్‌లకంటే రెండు పాయింట్లు అధికంగా ఈ బాలమేధావులు మెన్సా పరీక్షలో సాధించారు. ఈ స్థాయిలో పాయింట్లు సాధించినవారు ప్రపంచవ్యాప్తంగా ఒక్కశాతం మాత్రమే ఉన్నారు. కేవలం ఒక్క నిమిషం తేడాతో జన్మించిన నిష్కా నైసాలు చిన్నప్పటి నుంచే చాలా చురుకుగా ఉండేవారని తల్లిదండ్రులు చెబుతున్నారు.

This two Indian origin twins beat Einstein and Hawkings in IQ test

మెన్సా ఐక్యూ టెస్టులో కొత్త రికార్డు సృష్టిస్తామని తాము ముందుగా అనుకోలేదని ఈ అక్కా చెల్లెళ్లు చెప్పారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండటం, సోషల్ మీడియాజోలికి వెళ్లకపోవడం వల్లే ఈ విజయం సాధ్యమైందంటూ తమ సక్సెస్ మంత్రను బయటపెట్టారు నిష్కా నైసా. తమకు ఇంకా 11 ఏళ్లేనని ఈ వయసులోనే అవన్నీ అవసరం లేదని తాము భావించినట్లు చెప్పారు ఈ చిన్నారులు. ప్రస్తుతం ఈ ఇద్దరిని చైల్డ్ జీనియస్‌గా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+