బాంబులతో దద్దరిల్లిన టర్కీ: 14 మంది బలి
అంకారా: వరుస బాంబు పేలుళ్లతో టర్కీ దద్దరిల్లిపోయింది. వరుస బాంబు పేలుళ్లతో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. 226 మందికి తీవ్రగాయాలై ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్నారు.
ఈస్ట్ టర్కీలోని వ్యాన్ లేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో మొదట రెండు కారు బాంబులు పేలిపోయాయి. ఆగ్నేయ టర్కీలో సైనికులు వెలుతున్న మిలటరి వాహనం లక్షంగా చేసుకుని రోడ్డు పక్కన పెట్టిన బాంబు పేలింది.

తరువాత ఎలాజిగ్ పోలీస్ క్వాటర్స్ వద్ద మరో కారు బాంబు పేలింది. ఈ బాంబు దాడిలో 20 మంది పోలీసులు, 53 మంది పౌరులకు తీవ్రగాయాలైనాయి. బాంబు దాడుల్లో పలు వాహనాలు, భవనాలు దెబ్బతిన్నాయి.
టర్కీలో 38 వేల మంది ఖైదీలను విడుదల చేయ్యాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లో ఈ బాంబు దాడులు జరిగాయి. అయితే ఇప్పటి వరకు బాంబు దాడులకు తామే బాధ్యత వహిస్తున్నామని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదని టర్కీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications