'కేసీఆర్ కిట్' పథకాన్ని కాపీ కొట్టిన ట్రంప్.. అమెరికాలో పుట్టే ప్రతి బిడ్డ అకౌంట్లో 1000 డాలర్లు..?

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2017లో 'కేసీఆర్ కిట్' పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గర్భిణీ స్త్రీలు మరియు నవజాత శిశువుల కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, గర్భిణీ స్త్రీలకు ఆడబిడ్డ పుడితే రూ. 13,000 లను, మగబిడ్డ పుడితే రూ. 12,000లను మూడు దశల్లో అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కువ ప్రసవాలను ప్రోత్సహించడం, శిశు మరణాల రేటు తగ్గించడం ఈ పథకం ఉద్దేశం.

అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పుడు ఇలాంటి పథకమే తీసుకురానున్నారు."ట్రంప్ అకౌంట్" పేరుతో ఈ పథకాన్ని తీసుకురానున్నారు. 2025 నుంచి 2029 మధ్యలో అమెరికాలో జన్మించిన ప్రతి బిడ్డకు 1000 డాలర్లు అంటే ప్రస్తుతం ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 86,000 అందజేయనున్నారు. ఈ మేరకు ఈ పథకాన్ని తాజాగా రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు హౌస్ లో ప్రతిపాదించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. "ట్రంప్ అకౌంట్" పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ప్రకారం 2025 నుంచి 2029 మధ్య అమెరికాలో పుట్టే ప్రతి బిడ్డ పేరుమీద ఉన్న అకౌంట్ లో ట్రంప్ సర్కార్ 1000 డాలర్లను జమ చేస్తుంది. ఆ బిడ్డ తల్లిదండ్రులు ఏటా 5000 డాలర్ల వరకు జమ చేయవచ్చు. ఒక వేళ పేరెంట్స్ కు ఆ నగదు జమ చేసే స్తోమత లేకపోతే ప్రభుత్వమే జమ చేస్తుంది. అయితే అలా జమ అయిన నగదును కేవలం బ్రాడ్ స్టాక్ ఇండెక్స్ లోనే ఇన్వెస్ట్ చేయాలి లేదా పిల్లల చదువులు, వ్యాపారం, ఇళ్ల కొనుగోలు ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు. అంతేకానీ విలాసాలకు, జల్సాలకు వినియోగించకూడదని రూల్ పెట్టింది. ఇదో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ అని అక్కడి ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Trump Account Program Child Investment Initiative 2025 2029

ఈ బిల్లును వన్.. బిగ్, బ్యూటీఫుల్ బిల్లు అని రిపబ్లికన్ పార్టీ అభివర్ణించింది. ఇంతకుముందు మాగా అకౌంట్ అనే పేరు మీద ఉన్న స్కీమ్ ఇప్పుడు ట్రంప్ అకౌంట్ అని పేరు మార్చారు. విధి, విధానాలు అన్నీ ట్రంప్ సర్కార్ మార్చేసినట్లు సమాచారం. అయితే ట్రంప్ అకౌంట్ గురించి నెట్టింట చర్చకు రావడంతో పలువురు నెటిజెన్లు.. దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. ఇది గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ పథకం మాదిరిగా ఉందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+