వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: అమెరికాకు వీసా కావాలంటే 15 ఏళ్ళ చరిత్ర చెప్పాల్సిందే

వీసా నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా వీసా కోసం ధరఖాస్తు చేసుకొనే ప్రపంచవ్యాప్త అభ్యర్థులకు కొత్త ప్రశ్నావళిని ప్రవేశపెట్టింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వీసా నిబంధనలను అమెరికా మరింత కఠినతరం చేసింది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా వీసా కోసం ధరఖాస్తు చేసుకొనే ప్రపంచవ్యాప్త అభ్యర్థులకు కొత్త ప్రశ్నావళిని ప్రవేశపెట్టింది.

దీనిలో గత ఐదేళ్ళకు సంబంధించిన సోషల్ మీడియా సమాచారం . 15 ఏళ్ళ క్రితం బయోచరిత్ర వంటి సమాచారాన్ని చేర్చింది. ఈ కొత్త ప్రశ్నలతో అమెరికాకు వెళ్ళాలనుకొనేవారి పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారనుందని తెలిసింది.

వీసా నిబంధనల్లో సోషల్ మీడియా సమాచారం వంటి వాటిని అక్కడి విద్యాధికారులు, అకడమిక్ గ్రూప్స్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నా ట్రంప్ ప్రభుత్వం మాత్రం మే 23న, ఈ నిబంధనలను ఆమోదించనుంది.

Trump administration approves stringent visa norms that include social media checks

ఈ కొత్త కొత్త ప్రశ్నలతో వీసా జారీ ప్రక్రియ చాలా జాప్యమౌతోందని అంతర్జాతీయ విద్యార్థులను శాస్త్రవేత్తలను ఇది నిరుత్సాహపరుస్తోందని పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ కొత్త ప్రక్రియకు ట్రంప్ కార్యాలయం ఆమోదముద్ర వేయడంతో ముందుకలిగిఉన్న అన్ని పాస్ పోర్టు నెంబర్లు, గత ఐదేళ్ళలో వాడిన సోషల్ మీడియా వివరాలు, ఈమెయిల్ అడ్రస్ లు , పోన్ నెంబర్లు, 15 ఏళ్ల బయోగ్రాఫికల్ సమాచారం అంటే అడ్రస్ లు, ఉద్యోగం, ప్రయాణ వివరాలను ధరఖాస్తుదారులు సమర్పించాల్సిందే.

ఐడెంటిటీని ధృవీకరించాలంటే మరింత సమాచారం కోరే హక్కు కూడ అధికారులకు ఉంటుందని స్టేట్ డిపార్ట్ మెంట్ అధికారులు చెప్పారు. ఉగ్రవాదం, దేశ భద్రతకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అధికారులు చెప్పారు. వీసా అప్లికేషన్ల స్కృూట్నీని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ వివరాలను సేకరించనున్నట్టు స్టేట్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.

English summary
Continuing its hard-line approach against the existing visa rules, the Trump administration has rolled out a new questionnaire for US visa applicants worldwide that asks for social media handles for the last five years and biographical information going back 15 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X