ఇండియాకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్..ఆ దేశానికి మాత్రం బిగ్ షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది.డొనాల్డ్ ట్రంప్ హయాంలో విధించిన సుంకాలు అనేక దేశాలపై ప్రభావం చూపాయి. అంతర్జాతీయ సంబంధాలలో ఆర్థిక మార్పులకు దారితీశాయి.ఈ సుంకాలతో ఇతర దేశాలతో పాటు అమెరికా కూడా తీవ్రంగా నష్టపోతుందని ఆర్థిక నిపుణులు బహిరంగంగానే చెబుతున్నారు. ట్రంప్ చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై అనేక దఫాలుగా సుంకాలు విధించారు. వాణిజ్య లోటును తగ్గించడం మరియు అమెరికన్ పరిశ్రమలను ప్రోత్సహించడం దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. అయితే, దీని వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. తద్వారా దీని ప్రభాపం ప్రపంచ దేశాలపై పడింది.

జాతీయ భద్రతను కారణంగా చూపుతూ ట్రంప్ అన్ని దేశాల నుండి దిగుమతి చేసుకునే ఉక్కుపై 25% ,అల్యూమినియంపై 10% సుంకాలు విధించారు. దీని వల్ల అమెరికన్ ఉక్కు , అల్యూమినియం పరిశ్రమలకు కొంత మేలు జరిగినా, ఇతర పరిశ్రమల వ్యయాలు పెరిగాయి. అనేక దేశాలు ప్రతిస్పందనగా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించాయి.ట్రంప్ సుంకాల వల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరిగాయి, ఇది వినియోగదారులపై భారం వేసింది. కొన్ని అమెరికన్ పరిశ్రమలు లాభపడినప్పటికీ, చాలా పరిశ్రమలు పెరిగిన ముడిసరుకు ధరలు , ఇతర దేశాల ప్రతీకార సుంకాలను ఎదుర్కొన్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి కూడా మందగించింది. ఈ సుంకాలు అనేక దేశాలతో అమెరికా సంబంధాలను దెబ్బతీశాయి. వాణిజ్య భాగస్వాములతో వివాదాలు పెరిగాయి.

trump administration considering lifting tariffs

ట్రంప్‌ సుంకాల నిర్ణయాలతో అమెరికా స్టాక్‌మార్కెట్లు దారుణంగా నష్టపోయాయి. ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లు కూడా తీవ్రంగా నష్టాల్లో ముగిశాయి. ట్రంప్ సుంకాల నిర్ణయంపై స్వదేశంలో కూడా విమర్శలు రావడంతో ఆయన తాను తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. పలు దేశాలపై సుంకాలను ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దాదాపు 90 రోజుల పాటు ఈ టారిఫ్‌లు నిలిపివేయాలని ఇప్పటికే ఆ దేశ అధికారులకు ఇంటర్నల్ సమాచారం కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. చైనా మినహా మిగిలిన దేశాలపై సుంకాలను ఎత్తివేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా ప్రభుత్వం తీసుకున్న తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా విమర్శలు గుప్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+