'పేపర్ టైగర్' రచ్చ.. రష్యా - ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కామెంట్స్ !!
ఉక్రెయిన్‌తో సుదీర్ఘ యుద్ధం కారణంగా రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను క్రెమ్లిన్ ఖండించింది. ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ, రష్యాను "పేపర్ టైగర్"గా అభివర్ణించడాన్ని క్రెమ్లిన్ తోసిపుచ్చింది. మాస్కోను "బేర్"గా పేర్కొంటూ, "పేపర్ బేర్" అనేది లేదని స్పష్టం చేసింది.
"రష్యా పులి కాదు, అది బేర్‌తో ఎక్కువ సంబంధం కలిగి ఉంది. పేపర్ బేర్ అనేది అస్థిత్వంలో లేదు. రష్యా ఆర్థికంగా చాలా బలంగా ఉంది. ఉక్రెయిన్‌లో మా బలగాలు పైచేయి సాధిస్తున్నాయి" అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. తమ సైన్యం నష్టాలను తగ్గించుకోవడానికి అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్తుందని, వారి సామర్థ్యాలను తక్కువ అంచనా వేయకూడదని స్పష్టం చేశారు.

నిజానికి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి శాంతి ఒప్పందం కోసం ట్రంప్ గతంలో ప్రయత్నాలు చేశారు. అయితే, ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా జెలెన్‌స్కీతో భేటీ అయిన తర్వాత ఆయన తన స్వరాన్ని మార్చారు. మూడున్నరేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధం రష్యాను "పేపర్ టైగర్"గా మార్చిందని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ గతంలో కోల్పోయిన భూభాగాన్ని తిరిగి పొందగలదని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా రష్యా భారీ ఖర్చులు భరిస్తోందని, చమురు విక్రయాల ద్వారా నిధులు సమీకరించడం మాస్కోకు కష్టంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications