చంద్రుడిపై ఒక రాత్రి గడవాలంటే 14 రోజులు: సోలార్ టవర్ కు ప్లాన్..!!

చంద్రుడిపై అడుగుపెట్టి తిరిగి రావడానికే పరిమితం కావట్లేదు శాస్త్రవేత్తలు. అక్కడ దీర్ఘకాలం నివసించాలనే ఉద్దేశంతో నూతన ఆవిష్కరణలకు తెర తీస్తోన్నారు. భవిష్యత్తులో అక్కడ శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచి మౌలిక సదుపాయాలను సమకూర్చుకునే ప్రయత్నాలకు తెర తీశారు. అక్కడ శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలంటే నిరంతర విద్యుత్ సరఫరా అత్యవసరం. దీన్ని అధిగమించడానికి ప్రముఖ అంతరిక్ష సంస్థ బ్లూ ఆరిజిన్.. ఓ నూతన వ్యవస్థను రూపొందించింది.

చంద్రుడిపై స్థాపించడానికి పవర్ టవర్ ను డెవలప్ చేసింది. సోలార్ ప్యానెల్స్ అమర్చిన టవర్ ఇది. దీన్ని తాజాగా ఆవిష్కరించింది. చంద్రుడిపై పరిశోధనలకు అవసరమైన పవర్ గ్రిడ్‌ను నిర్మించడంలో ఈ పవర్ టవర్ కీలక పాత్ర పోషించనుంది. చంద్రుడి ఉపరితలంపై నివాసం ఉంటూ పరిశోధనలను సాగించడానికి ఇప్పటికే బేస్ క్యాంప్ నెలకొల్పే దిశగా నాసా శరవేగంగా అడుగులు వేస్తోన్న విషయం తెలిసిందే.

Blue Origin Unveils 20-Metre Vertical Power Tower to Generate More Than 10 kW on the Moon South Pole

ఈ క్రమంలో.. బ్లూ ఆరిజిన్ సంస్థ నూతనంగా ఈ సోలార్ పవర్ టవర్ కు రూపకల్పన చేసింది. దీని పొడవు 20 మీటర్లు. వర్టికల్ గా ఇది ఏర్పాటు కానుంది. సాధారణంగా సోలార్ ప్యానెల్స్ అన్నీ కూడా హారిజంటల్ గా అంటే అడ్డంగా ఏర్పాటవుతుంటాయి. ఇది మాత్రం నిట్టనిలువుగా ఉంటుంది. దీన్ని చంద్రుడి దక్షిణ ధృవం వద్ద నెలకొల్పనుంది బ్లూ ఆరిజిన్. ఈ టవర్ ద్వారా దాదాపు 10 కిలోవాట్ల కంటే ఎక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని తెలిపింది.

రేపటి నుంచి టీమిండియా వన్డేల జాతర.. !!
రేపటి నుంచి టీమిండియా వన్డేల జాతర.. !!

చంద్రుడిపై పగలు, రాత్రి సమయాలు భూమితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయనే విషయం తెలిసిందే. భూమిపై ఒక పగలు 24 గంటలైతే.. చంద్రుడిపై 14 రోజులు పడుతుంది. అదేవిధంగా రాత్రి కూడా. ఒక్క రాత్రి కాలం ముగియడానికి రెండు వారాలు పడుతుంది. దీనివల్ల సాధారణ సోలార్ ప్యానెల్స్ చంద్రుడిపై నిరంతరం పనిచేయలేవు. చంద్రుని దక్షిణ ధృవం వద్ద భౌగోళిక పరిస్థితులు పూర్తిగా వేరుగా ఉంటాయి.

ఫైనల్ లో ఇరాన్ ను కబడ్డీ ఆడేసిన భారత్
ఫైనల్ లో ఇరాన్ ను కబడ్డీ ఆడేసిన భారత్

చంద్రుడి అక్షం 1.5 డిగ్రీల కోణంలో వంగి ఉండటంతో ఆ ప్రదేశంలో సూర్యుడు ఎప్పటికీ క్షితిజ రేఖకు దాదాపుగా సమాంతరంగా చాలా తక్కువ ఎత్తులోనే కనిపిస్తాడు. ఈ రకమైన భౌగోళిక ల్యాండ్‌స్కేప్ వల్ల ఇక్కడి లోతైన గోతులలో ఎప్పటికీ చీకటిగా ఉంటే.. ఎత్తైన కొండల అంచులపై దాదాపు 90 శాతం కంటే ఎక్కువ సమయం సూర్యకాంతి పడుతూనే ఉంటుంది. ఈ పవర్ టవర్ ఎత్తుగా ఉండటం వల్ల నేరుగా సూర్యకాంతిని గ్రహిస్తుంది.

మాడ్యులర్ పద్ధతిలో ఈ సోలార్ టవర్ రూపుదిద్దుకోవడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి అనేక టవర్లను అనుసంధానిస్తూ ఓ పవర్ గ్రిడ్‌నే సృష్టించడానికి అవకాశం ఉంటుందని బ్లూ ఆరిజిన్ చెబుతోంది. ఇప్పటికే ఈ సంస్థ.. భూమిపై చంద్రుడి వాతావరణాన్ని పోలి ఉండే ప్రదేశాలలో ఈ టవర్ పనితీరును విజయవంతంగా పరీక్షించింది కూడా. ల్యాండర్‌పై అమర్చినప్పుడు దీని మొత్తం ఎత్తు దాదాపు 26 మీటర్ల వరకు ఉంటుంది. ఇది విజయవంతమైతే చంద్రుడిపై నిరంతరాయంగా క్లీన్ ఎనర్జీని అందుకోవచ్చని బ్లూ ఆరిజిన్ స్పష్టం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+