మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్.. చివరి రోజు ఘనంగా వీడ్కోలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ల బ్రోమాన్స్ ఇక ముగిసింది. తాజాగా ట్రంప్.. మస్క్ కు ఫేర్ వెల్ పార్టీ ఇచ్చారు. అమెరికాలోని అధికారిక ఓవల్ ఆఫీస్ లో ఫేర్ వెల్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ మీటింగ్ లో మస్క్ సేవలను ట్రంప్ కొనియాడారు. తమ ప్రభుత్వానికి మస్క్ కృషి చేశారని తెలిపారు. ఈ మేరకు మస్క్ కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పూర్తిగా మస్క్ వైదొలిగారు. ఈమేరకు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు రిపబ్లికన్ పార్టీ నేతలు.
ట్రంప్- మస్క్ ల మధ్య ఉన్న దృఢమైన బంధం ముగిసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం చేశారు. ట్రంప్ విజయంలో కీలకపాత్ర పోషించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(DOGE) వ్యవస్థను తీసుకొచ్చి ఈ విభాగానికి మస్క్ ను అధిపతిగా నియమించారు.

అయితే కొన్ని పరిపాలన, రాజకీయ విషయాల్లో ట్రంప్ దుందుడుకు స్వభావం, ఏకపక్ష నిర్ణయాలు మస్క్ కు నచ్చలేదు. ఈ క్రమంలో ఆయన ట్రంప్ కు దూరంగా జరగడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇటీవల ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన బిగ్ అండ్ బ్యూటిపుల్ బిల్లుపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లుతో అమెరికా ఆర్థికంగా నష్టపోతుందని అన్నారు. ఈ బిల్లుపై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బిగ్ అండ్ బ్యూటిపుల్బిల్లుకు అధికంగా ధనం ఖర్చు చేయడం తనకు అసంతృప్తిని కలిగించిందని ఓ ఇంటర్వ్యూలో మస్క్ తెలిపారు. ఈ బిల్లు కారణంగా అమెరికాలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రభుత్వానికి లోటు బడ్జెట్ ను మిగులుస్తుందని తెలిపారు. అయినా ట్రంప్ ఏమాత్రం లెక్కచేయకుండా బిల్లును పాస్ చేయించారు. దీంతో మస్క్, ట్రంప్ మధ్య రిలేషన్ పూర్తిగా సమాప్తం అయినట్లుగా భావించవచ్చు.
మరోవైపు గత కొంత కాలంగా మస్క్ కంపెనీలు భారీగా నష్టాలను చవి చూస్తున్నాయి. దీంతో డోజ్ నుంచి వైదొలిగి తన వ్యాపారంపై దృష్టి పెట్టాలని మస్క్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య అభిప్రాయ బేధాలు తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తాజాగా ట్రంప్.. మస్క్ కు ఫేర్ వెల్ పార్టీ ఇవ్వడంతో ఇక ట్రంప్- మస్క్ బంధం ముగిసినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications