• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నికల వేళ..ట్రంప్‌ మెడకు చెల్లెలి ఆడియో టేపుల వ్యవహారం: అబద్ధాలకోరుగా..క్రూరుడుగా

|

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. ఓ పాత ఆడియో టేపుల వ్యవహారం డొనాల్డ్ ట్రంప్‌ను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరాన్ని కల్పించినట్టయింది. ఈ ఆడియో టేపుల అంశం ట్రంప్ విజయావకాశాలను గండి కొట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ టేపులు డెమొక్రాట్లకు అస్త్రంగా దొరికిందనీ అంటున్నారు. గెలుపోటములను ప్రభావితం చేయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఎన్నికల సమయంలో ఇలాంటి వివాదాలు ట్రంప్‌కు కొత్తేమీ కాకపోయినప్పటికీ.. ఈ సారి కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయవి.

  Donald Trump సొంత చెల్లెలు Maryanne Trump ఆడియో టేపులు వెలుగులోకి ! ట్రంప్ విజయావకాశాలకు గండి..!!

  ఆ ఆడియో టేపులు మరెవరివో కాదు.. ట్రంప్ సొంత చెల్లెలు మరియాన్నా ట్రంప్ బెర్రీకి సంబంధించినవి. డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిత్వం గురించి 2018, 2019లో మరియాన్నా చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ టేపులు వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరియాన్నా ట్రంప్ బెర్రీ.. ఇదివరకు ఫెడరల్ న్యాయస్థానం న్యాయమూర్తిగా పనిచేశారు. పీహెచ్‌డీ పూర్తి చేశారు. మరియాన్నా ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆమె కుమార్తె, ట్రంప్ మేనకోడలు రికార్డు చేసినట్లుగా భావిస్తున్నారు. దీనిపై వాషింగ్టన్ పోస్ట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

  Trump is a ‘liar and cruel, says sister Maryanne Barry in recordings

  ఈ ఆడియో టేపుల్లో డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిత్వంపై మరియన్నా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు. ట్రంప్‌ను విలువల్లేని వ్యక్తిగా అభివర్ణించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో మరియన్నా పేరును ఉటంకించింది. మాట మీద నిలకడ ఉండదని, అబద్ధాలు చెబుతుంటారని పేర్కొంది. క్రూరుడిగా ట్రంప్‌ గురించి ప్రస్తావించినట్లు వాషింగ్టన్ ఈ కథనం స్పష్టం చేసింది. ట్రంప్ గురించి మాట్లాడటానికి తనకు ఎలాంటి భయం లేదని ఆమె పేర్కొన్నట్లు తెలిపింది.

  కొద్దిరోజుల కిందటే ఆమె రాసిన పుస్తకం ప్రచురితమైంది. మార్కెట్‌లోకి విడుదలైంది. టూ మచ్ అండ్ నెవర్ ఎనఫ్: హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ మ్యాన్.. అనే పేరుతో ఈ బుక్ కిందటి నెల 14వ తేదీన విడుదలైంది. ఇందులో కూడా ఆమె ట్రంప్ గురించి రాసుకొచ్చినట్లు చెబుతున్నారు. అదే సమయంలో- తాజాగా మరియన్నా ఆడియో టేపులు వెలుగులోకి రావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ట్రంప్‌కు ఇబ్బందులు తీసుకొస్తుందనే అభిప్రాయాలు చెలరేగడానికి కారణమౌతోంది. అదే సమయంలో ఈ ఆడియో టేపులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.

  ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా.. తాను అమెరికా ప్రజల కోసం పాటుపడతానని మరియాన్నా తెలిపారు. అమెరికా మునుపటి కంటే శక్తిమంతంగా మారబోతోందని ఆమె వ్యాఖ్యానించారు. మరో రెండు నెలల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్న సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ ఆడియో టేపుల వల్ల డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొనవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

  English summary
  Maryanne Trump Barry, President Donald Trump’s older sister and a former federal judge, described him as a liar who has “no principles” in a series of audio recordings made by her niece, Mary Trump, in 2018 and 2019. The recordings were provided to The Washington Post, which published them online Saturday night. In the recording, Barry can be heard disparaging her brother’s performance as president.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X