కిమ్ జాంగ్ ఉన్‌కు హెచ్చరిక, ఉ.కొరియా దెబ్బకు తగ్గిన ట్రంప్!

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: తమను తక్కువగా అంచనా వేయవద్దని దక్షిణ కొరియా మీడియా అధికార ప్రతినిధి ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్‌ను హెచ్చరించారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌తో తమ దేశ దౌత్యాధికారులు సమావేశమైన అంశాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. ఉత్తర కొరియా ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకున్నా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో అమెరికాకు చెందిన 28,500 మంది సైనికులు ఉన్నారని వెల్లడించారు.

అమెరికా అండతో కాదు.. సత్తా చాటగలం

అమెరికా అండతో కాదు.. సత్తా చాటగలం

అయితే అమెరికా సైనికుల అండను చూసుకుని తాము ఈ మాటలు చెప్పడం లేదని, తమ దేశాన్ని రక్షించుకోవడమెలాగో తమకు తెలుసునని స్పష్టం చేశారు. తమను తక్కువ అంచనా వేస్తే ఫలితం చూస్తారన్నారు.

తగిన సమయం కోసం..

తగిన సమయం కోసం..

కాగా, కిమ్ జాంగ్ ఉన్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరిపే అవకాశముందని, అందుకు తగిన సమయం కోసం అమెరికా వేచి చూస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచ వినాశనానికి దారితీసే కిమ్ చర్యలు సరికాదన్నారు.

ట్రంప్ తగ్గుముఖం

ట్రంప్ తగ్గుముఖం

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పైన నిప్పులు చెరిగే డొనాల్డ్ ట్రంప్ స్వరం మారింది. కిమ్‌ను ఎలా దారికి తెచ్చుకోవాలో తమకు తెలుసునని గతంలో ట్రంప్ చెప్పారు. అంతేకాదు, దక్షిణ కొరియా, జపాన్ సముద్ర జలాల్లో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని గత నెలలో హెచ్చరించారు.

నార్త్ కొరియా బలం తెలిసి

నార్త్ కొరియా బలం తెలిసి

ఉత్తర కొరియా క్షిపణి పరీక్షతో ఒక అంచనాకు వచ్చారు. కానీ ఉత్తర కొరియా బలం, అలాగే దాని వెనుక వెనుక రష్యా, చైనాలున్నాయన్న వాస్తవాన్ని ట్రంప్ గ్రహించారు.

ట్రంప్ రివర్స్ గేర్

ట్రంప్ రివర్స్ గేర్

ఈ నేపథ్యంలో తాజాగా దక్షిణ కొరియా దౌత్యాధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అమెరికా ప్రపంచశాంతిని కాంక్షిస్తుంది. ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం తమను ద్వేషించేవారిని కూడా అమెరికా క్షమిస్తుంది. అవసరమైతే అలాంటి వారిని కలిసి చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము' అని ట్రంప్ అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US President Donald Trump willing to engage Kim Jong un.
Please Wait while comments are loading...