"వెనీజులాపై దాడుల్ని రియల్ టైమ్ లో చూశా.. మా సైన్యం సేఫ్"

వెనీజులాపై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ దేశ రాజధాని కరాకస్​ పరిసర ప్రాంతాల్లోని ఏడు చోట్ల భారీ పేలుళ్లు జరిపింది. తరువాత వెనీజులా దేశాధ్యక్షుడు నికోలస్​ మదురో, అతని భార్య సిలియా ఫ్లోర్స్ ను కస్టడీలోకి తీసుకుంది. అమెరికాకు చెందిన డెల్టా ఫోర్స్‌ ఈ ఆపరేషన్‌ చేపట్టింది. అయితే ఈ ఆపరేషన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వెనీజులాపై అమెరికా సైన్యం ఆపరేషన్ ను తాను లైవ్ లో చూశానని తెలిపారు. ఫ్లోరిడాలోని మార్- ఏ- లాగో రిసార్ట్ నుంచి రియల్ టైమ్ లో చూశానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఫోక్స్ న్యూస్ కు ఇచ్చిన సమాధానంలో ట్రంప్ పేర్కొన్నారు.

" వెనీజులాపై ఆపరేషన్ ను లైవ్ లో చూడగలిగాను. రియల్ టైమ్ ద్వారా సైన్యం ప్రతి కదలికలను క్షుణ్ణంగా చూడగలిగాను. సైన్యం మధ్య కమ్యూనికేషన్ ను స్పష్టంగా విన్నాను. సైన్యం ప్రొఫెషనలిజం, లీడర్ షిప్ క్వాలిటీ చూడటం ఆశ్చర్యంగా ఉంది" అని ట్రంప్ తెలిపారు. అయితే ఈ ఆపరేషన్ లో అమెరికా సైన్యంలో ఎవరూ మృతి చెందలేదని స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని స్పష్టం చేశారు. అలాగే వెనీజులా అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోర్స్.. న్యూయార్క్ లో విచారణ జరుగుతుందని ట్రంప్ తెలిపారు. ఇక మరికొద్ది సేపట్లో ఇదే విషయంపై ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు వెనీజులాపై అమెరికా జరిపిన సైనిక దాడులు, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టును చైనా తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని చైనా పేర్కొంది. అమెరికా ఆధిపత్య ధోరణి అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తోందని మండిపడింది. అమెరికా.. కరేబియన్ ప్రాంతాల్లో శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తోందని తెలిపింది.

ఇక అమెరికా దాడులతో వెనీజులా అట్టుడికిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రవాణా అస్తవ్యస్తం అయింది. భయాందోళనతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నికోలస్ మదురో అమెరికాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా చేస్తున్నారని ట్రంప్ సర్కార్ ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే వెనీజులాపై అమెరికా దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

Trump Reveals Watched Maduro Capture Live in Flawless US Venezuela Operation No American Lives Lost

మరోవైపు వెనీజులా వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్ రష్యాకు చేరుకున్నట్లు రియటర్స్ కథనం ద్వారా తెలుస్తోంది. వెనీజులాపై అమెరికా వైమానిక దాడి చేసిన నేపథ్యంలో అధ్యక్షుడు మదురోను కస్టడీలోకి తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించిన కొద్ది సేపటి తర్వాత ఆమె రష్యాకు పయనం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వెనీజులా అధ్యక్షుడు నికోలస్ మదురో పై నార్కో టెర్రరిజం కేసు నమోదు చేసినట్లు అమెరికా అటార్నీ జనరల్​ పమేలా బోండి తాజాగా ప్రకటించారు. ఆయనపై అమెరికా చట్టాల ప్రకారం విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+