డెమోక్రాట్లతో కుమ్మక్కు, రిపబ్లికన్ల రహస్య మెమో: ముదిరిన ట్రంప్-ఎఫ్‌బీఐ జగడం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, దర్యాఫ్తు సంస్ ఎఫ్‌బీఐల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతోన్న దర్యాఫ్తులో డెమోక్రాట్లతో ఎఫ్‌బీఐ, న్యాయ విభాగం కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తూ ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్లు ఎఫ్‌బీఐపై మెమో విడుదల చేశారు.
ఎఫ్‌బీఐ వద్దని వారిస్తున్నా వినకుండా ట్రంప్ ఈ మెమోను ఆమోదించి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలకు పంపించారు. మెమోరాండంలో వెల్లడైన వివరాలు సిగ్గుచేటు అని ట్రంప్ అన్నారు.
న్యాయ విభాగంతో కుమ్మక్కై ఎఫ్‌బీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించిన అనంతరం ప్రతిదాడి మొదలైంది. దర్యాప్తు సంస్థల ప్రతినిధులతోపాటు డెమోక్రాట్లూ ట్రంప్ వర్గంపై విమర్శలు ఎక్కుపెట్టారు.

అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచార సలహాదారుగా పనిచేసిన కేటెర్ పేజ్‌పై రష్యా ఏజెంట్‌గా ముద్రవేసి అక్రమంగా నిఘా పెట్టారని దీనిలో సంచలన వ్యాఖ్యలుచేశారు. ఈ విషయంపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ సారా శాండర్స్ ఓ ప్రకటనా విడుదలచేశారు.
'న్యాయవిభాగం, ఎఫ్‌బీఐలలోని ఉన్నత అధికారులు తీసుకున్న నిర్ణయం వెనకున్న ఉద్దేశం, నిజాయితీపై తీవ్ర ఆందోళనలు వినిపిస్తున్నాయి. రిపబ్లికన్ల రహస్య మెమో వీటిని ప్రధానంగా ఎత్తిచూపుతోంది. కేవలం విపక్షాల ఆరోపణల పత్రం ఆధారంగా పేజ్‌పై దర్యాప్తు మొదలుపెట్టారు. ఆయనపై ట్రంప్‌కు ఎంతో నమ్మకముంది. అమెరికా భద్రత, చట్టాల పరిరక్షణ, పౌరుల రాజ్యాంగబద్ధ హక్కులు కాపాడేందుకు పేజ్ ఎంతో శ్రమిస్తార'ని శాండర్స్ పేర్కొన్నారు.
మరోవైపు ట్రంప్ వర్గం ఆరోపణలు, వారు పెడుతున్న చర్చల గురించి ఎలాంటి ఆందోళనా వద్దని అధికారులు, ఉద్యోగులకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే ఓ లేఖ, వీడియో సందేశాన్ని పంపారు. 'అమెరికా ప్రజలు వార్తా పత్రికలు చదువుతారు. టీవీల్లో వచ్చే చర్చలూ చూస్తారు. జాతి భద్రతకు మీరు చేస్తున్న కృషి వారికి తెలుసు. ఊరికే మాట్లాడటం స్థాయిని దిగజార్చుకోవడమే. మీరుచేసే కృషికి ఎప్పుడూ విలువ ఉంటుంద'ని వీడియోలో క్రిస్టోఫర్ వ్యాఖ్యానించారు.
రష్యా జోక్యం అంశంపై విచారణ చేపడుతున్న అధికారులతో పాటు డిప్యూటీ అటార్నీ జనరల్ రోడ్ జే రీసెన్ స్టెయిన్ పైనా ట్రంప్ వేటువేసే అవకాశముందని వార్తలు వినిపించాయి. ఇలాంటి చర్యలతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ముప్పుందని డెమోక్రాట్లు హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, ఎఫ్‌బీఐపై ఆరోపణలు గుప్పిస్తూ రిపబ్లికన్లు విడుదలచేసిన మెమోను భారతీయ అమెరికన్ న్యాయవాది కశ్యప్ కేశ్ పటేల్ తయారుచేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి సంబంధించిన నిఘా వ్యవహారాలు పర్యవేక్షించే చట్టసభ కమిటీకి సీనియర్ న్యాయవాదిగా ఈయన పనిచేస్తున్నారు.
ఈ కమిటీకి డేవిన్ న్యూన్స్ నేతృత్వం వహించారు. అయితే మోమోను పటేల్ ఒక్కరే తయారుచేశారన్న వార్తలను న్యూన్స్ కార్యాలయం తోసిపుచ్చింది. అది బృంద కృషి ఫలితమని వివరించింది. బృందానికి పటేల్ విలువైన సేవలు అందించారని పేర్కొంది. మీడియాలో వచ్చిన వార్తల్లో నిజంలేదని పటేల్ తెలిపారు.
-
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!












Click it and Unblock the Notifications