ట్రంప్ కొత్త రాగం! ఇకపై కిమ్‌ని అలా పిలవను.. వీలైతే ఫ్రెండ్షిప్ చేసుకుంటా..

Posted By:
Subscribe to Oneindia Telugu
  Trump On Kim Jong Un : కిమ్‌ తో ఫ్రెండ్షిప్ చేసుకుంటా

  వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త రాగం అందుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పై మండిపడిన ఆయన ఇప్పుడు మాటమార్చారు. వీలైతే కిమ్ తో ఫ్రెండ్షిప్ చేసుకుంటానని కూడా చెబుతున్నారు.

  బాంబు పేల్చిన ట్రంప్ పెద్ద కొడుకు! 'అవును, వికీలీక్స్‌తో 'టచ్'‌లో ఉన్నా..', చాటింగ్ బహిర్గతం!

  ''కిమ్‌ నన్ను 'ఓల్డ్‌మ్యాన్‌' అంటూ అవమానిస్తున్నారు. నేనూ అతన్ని 'లిటిల్‌ అండ్‌ ఫ్యాట్‌' అని పిలుస్తూ అగౌరవపరుస్తున్నాను.. ఇకపై కిమ్‌ను అలా పిలవరాదని భావిస్తున్నాను..'' అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

  Trump's latest tweetstorm called Kim Jong Un “short and fat”

  12 రోజుల ఆసియా పర్యటనలో భాగంగా ప్రస్తుతం వియత్నాంలో ఉన్న ట్రంప్‌ పై విధంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, 'కిమ్‌తో స్నేహం చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. ఏదో ఓ రోజు మేమిద్దరం మంచి స్నేహితులమవుతాం..' అని కూడా ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

  ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ట్రంప్‌ ఎదుట ప్రస్తావించగా... 'అవును, కిమ్‌తో ఫ్రెండ్‌షిప్‌ చేయాలని అనుకుంటున్నాను. ఆయన మాతో స్నేహం చేస్తే ఉత్తరకొరియాకు చాలా మంచిది. ప్రపంచ దేశాలకూ చాలా మంచిది..' అని ట్రంప్ అన్నారు.

  చైనా 'భస్మాసుర హస్తమే'! అప్పులిచ్చి.. దేశాలకు చుక్కలు చూపిస్తోన్న డ్రాగన్!

  అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య ఉద్రికత్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరుదేశాధినేతలు ఒకరిపై మరొకరు ట్విట్టర్‌ వేదికగా పంచ్‌లు విసురుకుంటున్నారు. ట్రంప్‌ ఆసియా దేశాల పర్యటనను కూడా ఉత్తరకొరియా అధినేత తీవ్రంగా వ్యతిరేకించారు.

  ఆసియా దేశాలను ఉత్తరకొరియాపైకి ఎగదోయాలని ట్రంప్‌ కుట్రపన్నారని, ఆ కుట్రలో భాగంగానే ఆయన అన్ని దేశాలు తిరుగుతూ ఆయా దేశాల అధినేతలను తనతో కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని కిమ్ బాహాటంగానే వ్యాఖ్యానించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  President Donald Trump has mostly stayed on message during his nearly two-week trip to Asia, focusing on trade and the North Korean nuclear threat. Finally, at 7:48 am Hanoi time, Trump lobbed a sarcastic putdown at North Korean leader Kim Jong Un, calling him “short and fat.” So Trump took to Twitter to hit back: “Why would Kim Jong-un insult me by calling me ‘old,’ when I would NEVER call him ‘short and fat? Oh well, I try so hard to be his friend - and maybe someday that will happen!”

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి