ఇరాన్‌ను ఎవరు పాలిస్తున్నారు? ట్రంప్ వ్యాఖ్యలతో రగిలిపోతున్న టెహ్రాన్

పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు నిర్వహిస్తున్న యుద్ధం ఎనిమిదో నెలకు చేరుకున్న వేళ సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫిబ్రవరి చివర్లో ప్రారంభమైన ఈ తీవ్రస్థాయి పోరులో ఇరాన్ అగ్ర నాయకత్వం తుడిచిపెట్టుకుపోవడంతో, ప్రస్తుతం ఆ దేశాన్ని అసలు ఎవరు నడిపిస్తున్నారో ఎవరికీ తెలియడం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అగ్ర నాయకులు, వారి తర్వాతి స్థానాల్లో ఉన్న నేతలంతా హతమవ్వడంతో ఒక స్పష్టమైన నాయకత్వం లేక ఇరాన్ కొట్టుమిట్టాడుతోందని ట్రంప్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అసలు ఇరాన్ ను ఎవరు నడిపిస్తున్నారో ఎవరికీ తెలియకపోవడమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది అని ట్రంప్ అనడం అంతర్జాతీయంగా కలకలం రేపింది.

Trump Says Nobody Knows Who Runs Iran as Conflict Enters Eighth Month Warns of Unpredictable Future
రష్యాకు అమెరికా ఆపన్నహస్తం.. ప్లేగ్ వ్యాధి విజృంభణ నేపథ్యంలో ట్రంప్ కీలక నిర్ణయం..
రష్యాకు అమెరికా ఆపన్నహస్తం.. ప్లేగ్ వ్యాధి విజృంభణ నేపథ్యంలో ట్రంప్ కీలక నిర్ణయం..

అగ్ర నేతల హతం.. అదృశ్యమైన వారసుడు!

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన కుమారుడు మోజ్తబా ఖమేనీ కూడా అదే దాడిలో తీవ్రంగా గాయపడి, ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రంగా మండిపడింది. తమ దేశంలో నిర్ణయాధికారం ఎవరి చేతుల్లో ఉందో, వ్యవస్థ ఎలా పనిచేస్తుందో వాషింగ్టన్‌కు బాగా తెలుసని, అమెరికా అధికారుల మధ్యే పరస్పర విరుద్ధ ప్రకటనలు ఉన్నాయని ఇరాన్ ప్రతినిధి ఘాటుగా సమాధానమిచ్చారు.

అమెరికా సైనికుల్ని చంపితే 11 కోట్లు- ఇరాన్ లో సైనికాధికారుల జాడ చెప్తే 143 కోట్లు ..!
అమెరికా సైనికుల్ని చంపితే 11 కోట్లు- ఇరాన్ లో సైనికాధికారుల జాడ చెప్తే 143 కోట్లు ..!

రాజకీయంగా ట్రంప్‌కు మిడ్ టర్మ్ ముప్పు!

ఇరాన్ ప్రతిదాడిలో భాగంగా ఇజ్రాయెల్ సహా అమెరికా స్థావరాలున్న గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడటంతో యుద్ధ వాతావరణం మరింత ముదిరింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు (పెట్రోల్, డీజిల్) భారీగా పెరిగిపోవడం రాబోయే అమెరికా మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పీఠాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న రిపబ్లికన్ పార్టీకి, పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, పడిపోతున్న ట్రంప్ ప్రజాదరణ ప్రతిబంధకంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+