కారణమిదే: భారత్‌పై ట్రంప్ అసంతృప్తి

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికాకు చెందిన హర్లీ డేవిడ్‌సన్ బైక్‌ల దిగుమతిపై ఇండియా అధికంగా పన్ను వసూలు చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పద్దతి సరైందికాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.భారత్‌ నుంచి అమెరికాకు దిగుమతయ్యే మోటార్‌సైకిళ్లపైనా సుంకాన్ని పెంచుతామని హెచ్చరించారు.

విదేశాల్లోనే పూర్తిగా తయారై దిగుమతి చేసుకునే ఈ బైక్‌లపై ప్రాథమిక సుంకాన్ని 50 శాతానికే పరిమితం చేసింది. గతంలో కంటే పన్నును తగ్గించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతంలో 800సీసీ అంతకన్నా తక్కువ సామర్థ్యం గల బైక్‌లను దిగుమతి చేసుకొంటే 60శాతం, 800సీసీ అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల బైక్‌లపై 75శాతం సుంకం విధఇంచేవారు.. అయితే దీన్ని 50 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.

Trump slams India's 50% import tariff on Harley-Davidson, calls it 'unfair'

ఇటీవల భారత ప్రభుత్వం హార్లీడేవిడ్‌సన్‌ బైక్‌లపై టారిఫ్‌ను 75శాతం నుంచి 50శాతానికి తగ్గించింది. కానీ ఇది సరిపోదు అని ట్రంప్‌ అన్నారు. అమెరికా భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే బైక్‌లకు సుంకాన్ని విధించడంలేదని, భారత్‌ మాత్రం అధిక సుంకం వేస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.. రెండు దేశాల్లో ఒకే రకమైన పన్ను ఉండాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. రెండు దేశాల్లో 'రెసిప్రోకల్‌ ట్యాక్స్‌' విధానం ఉండాలని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
US President Donald Trump on Tuesday slammed India for a high import tariff on Harley-Davidson motorcycle, calling it "unfair", even as New Delhi slashed customs duty on imported motorcycles from high-end brands to 50 per cent.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి