బైడెన్‌కు భారీ షాక్: ట్రంప్ అనూహ్య ఎత్తుగడ -ఎన్నికల అక్రమాలపై ప్రజల్లోకి -కీలక రాష్ట్రాల్లో ర్యాలీలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ మ్యాజిక్ మార్కు(270) దాటి 290 ఓట్లు సాధించి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా నిలిచినప్పటికీ.. సదరు ప్రకటనల్ని తాను అంగీకరించబోనని, 7 కోట్లకుపైగా లీగల్ ఓట్లతో తానే గెలిచానని రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్నారు. హుందాగా ఓటమిని అంగీకరించాలంటూ అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ట్రంప్ మరో అనూహ్య ఎత్తుగడకు తెరలేపారు. దీనిని ట్రంప్ క్యాంపెయిన్ సైతం అధికారికంగా ధృవీకరించింది.

బైడెన్‌కు షాకిచ్చేలా

బైడెన్‌కు షాకిచ్చేలా

తాజా అప్ డేట్ ప్రకారం.. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకుగానూ బైడెన్ 290, ట్రంప్ 214 ఓట్లను రాబట్టుకున్నారు. బ్యాటిల్ గ్రౌండ్ గా పిలుస్తోన్న 11 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నది. పూర్తి స్థాయి ఫలితాలు వెలువడటానికి కనీసం మరో మూడు రోజులు పట్టే అవకాశమున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల ప్రకారం డెమోక్రాట్ల గెలుపును తృణీకరిస్తోన్న ట్రంప్.. బైడెన్ కు భారీ షాక్ ఇవ్వాలని భావిస్తున్నారని, అందుకోసం ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు..

 ఇదీ ట్రంప్ తాజా ఎత్తుగడ..

ఇదీ ట్రంప్ తాజా ఎత్తుగడ..

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ట్రంప్ మాటలను అమెరికన్ మీడియా ప్రసారం చేయకపోవడం, సోషల్ మీడియా సంస్థలు సైతం ఆయన పోస్టుల కింద బ్లూ మార్కుతో ‘ఇది తప్పుడు సమాచారం' అని కాషన్ జోడిస్తుండటంతో ఇక నేరుగా ప్రజల్లోనే తేల్చుకోవాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి గడిచిన కొంత కాలంగా మోసం ఎలా జరిగిందో, అడగని వాళ్లకు కూడా బ్యాలెట్ పేపర్లను ఎలా పంపారో, ఎన్నికలు ముగిసి ఇన్ని రోజుల తర్వాత కూడా పోస్టల్ ఓట్లను స్వీకరిస్తూనే ఉండటం వెనుక మతలబు ఏమిటో, ఈ మొత్తం తతంగాన్ని డెమోక్రాట్లు ఏ విధంగా ప్లాన్ చేశారో ట్రంప్ క్యాంపెయిన్ ప్రజలకు వివరించనుంది. ఇందు కోసం ఎన్నికల సభల తరహాలోనే ర్యాలీలు చేపట్టనున్నారు.

 ధృవీకరించిన ట్రంప్ క్యాంపెయిన్

ధృవీకరించిన ట్రంప్ క్యాంపెయిన్

ఎన్నికల్లో అక్రమాలు జరగాయనడానికి రుజువులను ప్రజల్లోకి తీసుకెళ్లేలా త్వరలోనే ర్యాలీలు చేపట్టబోతున్న విషయాన్ని ట్రంప్ క్యాంపెయిన్ కమ్యూనికషన్స్ డైరెక్టర్, ట్రంప్ వ్యక్తిగత లాయర్ టిమ్ మార్తోగ్ ధృవీకరించారు. ముందుగా జార్జియా, పెన్సిల్వేనియా, ఆరిజోనా లాంటి బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ లో సభలు నిర్వహిస్తామని, రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాల్లోనూ ర్యాలీలు చేపడతామని టిమ్ మీడియాకు చెప్పారు. అయితే, ఆయా రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిల్లో విస్తృతంగా జరపబోయే సభలకు ప్రెసిడెంట్ ట్రంప్ నేరుగా హాజరయ్యే అవకాశాలు తక్కువేనని టిమ్ పేర్కొన్నారు. నిజానికి..

ట్రంప్‌పై కొడుకులు, అల్లుడి ఒత్తిడి..

ట్రంప్‌పై కొడుకులు, అల్లుడి ఒత్తిడి..

ఎన్నికల ఫలితాలను అంగీకరించే లేదా వ్యతిరేకించే విషయంలో ట్రంప్ కుటుంబం నిలువునా చీలిపోయినట్లు అమెరికన్ మీడియా కథనాలు రాసింది. హుందాగా ఓటమిని ఒప్పుకుని, మర్యాదగా తప్పుకుందామని ట్రంప్ భార్య మెలానియా, కూతురు ఇవాంకా నచ్చచెప్పే ప్రయత్నం చేశారని తెలిసింది. కానీ ఇవాంక భర్త జాడెర్ కుష్నర్, ట్రంప్ కొడుకులు జూరియర్, ఎరిక్‌లు మాత్రం పోరాటాన్ని కొనసాగింద్దామనే వాదిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలపై ర్యాలీలు నిర్వహించే దిశగా ఆ ముగ్గురూ ట్రంప్ పై ఒత్తిడి పెంచారని, అసలే తెంపరి అయిన ట్రంప్ అందుకు సరే అన్నారని విశ్వసనీయంగా తెలిసినట్లు సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ తదితర సంస్థలు వెల్లడించాయి. ఇదే నిజమైతే అమెరికాలో అధికార మార్పిడి ఇంకాస్త గందరగోళానికి దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+