"ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధం..!"
ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇరాన్ పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో మరో 4-5 వారాలు యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు. అంతకంటే ఎక్కువకాలం కూడా యుద్ధం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారుల్లో దాదాపు అందరూ చనిపోయారని.. ఆ దేశ ప్రజలు ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ లోని మిలిటరీ అధికారుల్లో దాదాపు అందరూ మరణించారని తెలిపారు. అయితే ఇరాన్ పై యుద్ధం కొనసాగుతూనే ఉంటుందన్నారు. మరో 4 నుంచి 5 వారాలపాటు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ కు చెందిన 9 నౌకలను ధ్వంసం చేశామని తెలిపారు. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇరాన్ సైన్యం లొంగిపోవాలని భావిస్తోందని ట్రంప్ వివరించారు.
మరోవైపు ఇరాన్ లో అమెరికా చర్యకు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మద్దతు తెలిపారు. అమెరికాకు యూరప్ సంపూర్ణ మద్దుతు ఇస్తుందని మార్క్ రుట్టే పేర్కొన్నారు. ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు నిర్వహిస్తోంది. ఇరాన్ పై వరుసగా మూడోరోజు దాడులు కొనసాగుతున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఇరాన్ లో 555 మంది ప్రాణాలు కోల్పోయారు.

అంతేకాక ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇదే దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఖమేనీ భార్య తాజాగా మృతి చెందారు.












Click it and Unblock the Notifications