వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు షాక్: బ్రిటిష్ పార్లమెంటలో నో స్పీచ్

యుకె పర్యటనలో ట్రంప్‌నకు ఎదురు దెబ్బ తగలనుంది. బ్రిటన్ పార్లమెంటులో ట్రంప్‌ను మాట్లాడనివ్వబోమని స్పీకర్ చెప్పారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు లండన్ పర్యటనలో ఎదురు దెబ్బ తగలనుంది. బ్రిటిష్‌ పార్లమెంటులో ప్రసంగించడానికి ట్రంప్‌ను అనుమతించబోమని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ స్పీకర్‌ జాన్ బెర్కో తెలిపారు. త్వరలో ట్రంప్‌ యూకే పర్యటన చేయనున్నారు. అయితే ఈ పర్యటనలో భాగంగా ఆయన తమ పార్లమెంటులో ప్రసంగించడానికి అంగీకరించబోమని చెప్పారు.

ట్రంప్‌ చూపిస్తున్న జాతి వివక్ష, ఆయనపై వచ్చిన లైంగికవేధింపుల ఆరోపణల కారణంగా ట్రంప్‌ను పార్లమెంటులో ప్రసంగానికి ఆహ్వానించడంలేదని ఆయన చెప్పారు. వలసదారులు, శరణార్థులపై ఆయన ఆంక్షలు విధించిన తర్వాత తాను స్వయంగా ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బెర్కో చెప్పారు.

అమెరికాతో బ్రిటన్‌కు ఉన్న సంబంధాలను తాము గౌరవిస్తున్నామని చెప్పారు. అయితే హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ జాతి వివక్ష, లైంగిక వేధింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చట్టం, న్యాయం ముందు అంతా సమానమని తాము భావిస్తామని బెర్కో చెప్పారు

 Trump will not be allowed to address Parliament on UK state visit: John Bercow

బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ట్రంప్‌ను యూకే పర్యటనకు ఆహ్వానించారు. అయితే ఆయన యూకే పర్యటనకు రానున్నట్లు ప్రకటించగానే దాదాపు 20లక్షల మంది ప్రజలు ఆయన పర్యటనను రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పిటిషన్‌పై సంతకాలు చేశారు.

పార్లమెంటులో ప్రసంగం చేయడం దానంతటదే వచ్చే హక్కు కాదని, అది సంపాదించుకునే గౌరవమని ఆయన అన్నారు. అమెరికాతో సబంధాలకు తాము విలువ ఇస్తామని ఆయన అన్నారు.

English summary
John Bercow, the Speaker, said he was “strongly opposed” to Mr Trump speaking in the Commons as he stressed that being invited to address Parliament was “not an automatic right” but “an earned honour”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X