"మనం మనం దోస్తులం".. భారత్ పై ట్రంప్ సంచలనం

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. భారత్ పై ఏకంగా 50 శాతం టారిఫ్ లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 27 నుంచి భారత వస్తువులపై 50 శాతం టారిఫ్ లు అమలవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. " నేను భారత్ కు చాలా దగ్గరలో ఉన్నాను. భారత్ తో అమెరికాకు మంచి రిలేషన్ ఉంది. అలాగే ప్రధాని మోదీకి కూడా చాలా దగ్గరలోనే ఉన్నాను. మోదీతో నాకు చాలా మంచి స్నేహం ఉంది. నిన్ననే మోదీతో మాట్లాడాను. ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పాను" అని ట్రంప్ పేర్కొన్నారు.

రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసేందుకు ట్రంప్ ఎంచుకున్న అస్త్రం భారత్ పై సుంకాలు విధించడమే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్ పై టారిఫ్ లు విధించి తద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టాలని ట్రంప్ ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే భారత్ పై ఏకంగా 50 శాతం టారిఫ్ లు విధించారు. ఈ సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి అగ్రరాజ్యానికి ఎగుమతయ్యే 48 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై సుంకాలు ప్రభావం చూపనున్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ట్రేడ్ వార్ ను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Trump s Warm Words Always Friends with Modi US President Hails Special US-India Bond Amid Trade Talks

భారత్ తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు. అలాగే ప్రధాని మోదీతోనూ చాలా మంచి స్నేహం ఉందని తెలిపారు. కానీ రష్యాను నిలువరించేందుకు సుంకాలు విధించడం తప్పడం లేదని అన్నారు. అలా చేస్తేనే రష్యా దిగి వస్తుందని తెలిపారు. ఇప్పటికే చైనా.. అమెరికాకు భారీగా సుంకాలు చెల్లించుకుంటోందని భవిష్యత్తులో ఆ సుంకాలను పెంచే ఆలోచన ఉన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ తో భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+