'మహిళలు ఎప్పటికీ పురుషులతో సమానం కాలేరు'
న్యూఢిల్లీ: టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ఆదివారం నాడు మహిళల హక్కులపై ఏర్పాటు చేసిన సభలో పురాధిపత్యం ప్రదర్శించే వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఎప్పటికీ పురుషులతో సమానం కాలేరని అభిప్రాయపడ్డారు.
అమెరికన్లును కనిపెట్టింది ముస్లింలేనంటూ రెచ్చగొట్టే ప్రకటన చేసిన వారం రోజులు కాకముందే మరో రెచ్చగొట్టే ప్రకటన చేశారు టర్కీ దేశ అధ్యక్షుడు. సహజంగా మహిళలు సున్నితమైన వారని, దాంతో, వారిని పురుషులతో సమానులుగా చూడలేమని చెప్పారు.
"పురుషుడు చేసే ప్రతి ఉద్యోగంలో మహిళలను నియమించలేం. స్త్రీవాదులు మాతృత్వం విలువను గుర్తించడంలేదు" అని పేర్కొన్నారు. పలుగు, పార ఇచ్చి వారితో పనిచేయించలేమని తెలిపారు.

అయితే, చట్టం పరిధిలో మాత్రం వారిని సమానంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సామాజికంగా స్త్రీపురుషుల పాత్రను గుర్తించాల్సి ఉందన్నాడు. శారీరకంగా సమానులు కారన్న సంగతి తెలిసిందేనని, అయితే, హక్కులు, స్థాయి, అవకాశాలు పొందడంలో వారు పురుషులతో సమంగా పరిగణించాలని సూచించారు.
అంతర్జాతీయ మహిళా హక్కుల కార్యకర్తలు తయ్యిప్ ఎర్డోగాన్ వ్యాఖ్యలు క్షమించరానివిగా పరిగణిస్తున్నారు. మహిళల హక్కుల సమస్యలపై దేశాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు వారి భద్రత గురించి ఏపాటివో గుర్తు చేస్తున్నాయని పేర్కొన్నారు.
హింస నుంచి మహిళలను రక్షించేందుకు బలమైన చట్టాలు ఉన్నాయని.. ఐతే వాటిని సక్రమంగా పరిరక్షించేందుకు కోర్టులు, పోలీసులు తమ వంతు సహకారం అందించడంలేదని ఇస్తాంబుల్‌కు చెందిన మహిళా హక్కుల కార్యకర్త ఫిక్రియా ఇల్‌మాజ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications