వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జంట పేలుళ్లతో వణికిన కాబూల్ : 50 మందికి పైగా మృతి?

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా జాతీయ పార్లమెంటు సమీపంలోనే జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 50 మందికి పైగానే మరణించగా, పలువురు క్షతగాత్రులైనట్లు పోలీసుల ప్రాథమిక అంచనా.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా జాతీయ పార్లమెంటు సమీపంలోనే జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 50 మందికి పైగానే మరణించగా, పలువురు క్షతగాత్రులైనట్లు పోలీసుల ప్రాథమిక అంచనా.

మరోవైపు ఈ జంట పేలుళ్లు తమ పనేనంటూ ఆఫ్ఘాన్ తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన నిఘా సంస్థ అయిన ఎన్ డీ ఎస్ నుంచి సిబ్బందితో వెళ్తున్న మినీ బస్సు లక్ష్యంగా ఈ దాడి జరిగింది.

కార్మికులు ఇళ్ళకు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికార వర్గాల సమాచారం. చాలాకాలం నుంచి ప్రశాంతంగా ఉంటున్న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో హఠాత్తుగా జరిగిన ఈ దాడితో ఒక్కసారిగా కలకలం రేగింది.

Twin Suicide Blasts Rocked Kabul, More than 50 Were Killed

బాగా రద్దీగా ఉండే ప్రాంతాన్నే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. దారుల్ అమన్ ప్రాంతంలో ఒక ఆత్మాహుతి బాంబర్ తనను తానె పేల్చేసుకున్నాడని అధికారులు తెలిపారు.

నిజానికి ఆఫ్ఘానిస్తాన్ పార్లమెంటు భావన నిర్మాణానికి భారత దేశమే సాయం చేసింది. మొదటి పేలుడు జరిగిన తర్వాత కొద్దిసేపటికే మరో కారు బాంబు పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురైనట్లు అధికారులు చెప్పారు.

English summary
Two separate explosions go off near Afghanistan's parliament offices in Kabul, in an attack claimed by the Taliban.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X