వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒత్తిడి: ట్విట్టర్‌ తప్పుకోనున్న సీఈఓ డిక్ కోస్టోలో

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిక్ కోస్టోలో జులై 1న తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ట్విట్టర్ వృద్ధి రేటు నెమ్మదించడం, అనుకున్న స్ధాయిలో ఆకట్టుకోలేక పోవడం లాంటి కారణాల వల్ల ఆయన తీవ్ర ఒత్తిడికి లోనై ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఆయన స్ధానంలో వేరొకరిని నియమించాలని కోరారు. దీంతో ఆయన స్ధానంలో ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు నిర్వహించనున్నారు. కోస్టొలో గత ఐదేళ్లుగా ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Twitter's Dick Costolo to step down as CEO in yet another shake-up

కోస్టొలో తర్వాత ఎవరిని నియమించాలనే దానిపై బోర్డు సభ్యుల మధ్య ఏడాదిగా మంతనాలు జరుగుతున్నాయి. కోస్టొలో సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టాప్ మెనేజ్మెంట్‌లో అత్యధిక శాతం మంది ఉద్యోగులను తొలగించి, వారి స్ధానాల్లో కొత్త వారిని నియమించారు.

English summary
Twitter Inc Chief Executive Officer Dick Costolo abruptly announced he was stepping down on Thursday amid increasing scrutiny of the company's slow user growth and inability to attract advertisers at the same rate as its competitors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X