Viral video: రెండు విమానాలు గాలిలో ఢీ కొంటే ఎట్టా ఉంటాదో తెలుసా?

వాషింగ్టన్: అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. రెండు సైనిక విమానాలు గాల్లోనే ఢీ కొట్టుకున్నాయి. నిప్పులు చిమ్ముతూ నేల కూలాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వినియోగించిన ఎయిర్ క్రాఫ్ట్స్ అవి. ఈ ప్రమాదంలో ఆరుమంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన పట్ల అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు.

టెక్సాస్‌ స్టేట్‌లోని డల్లాస్‌లో ఓ ఎయిర్ షో జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వింగ్స్ ఓవర్ డల్లాస్ పేరుతో డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఎయిర్ షో ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వినియోగించిన ఎయిర్ క్రాఫ్ట్స్ అవి. ఎయిర్ షోలో భాగంగా బోయింగ్ బీ-17 బాంబర్‌ చక్కర్లు కొడుతున్న సమయంలో బెల్ పీ-63 కింగ్‌ కోబ్రా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ దానికి ఎదురుపడింది. నేరుగా దాన్ని ఢీ కొట్టింది.

Two aircraft collided mid-air at an air show at Texas, Six people are feared dead

ఆ వెంటనే పెద్ద శబ్దం చేస్తూ ఈ రెండు విమానాలు గాల్లోనే పేలిపోయాయి. ముక్కలయ్యాయి. నేల కూలిన మరుక్షణమే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్స్‌లల్లో ముగ్గురు చొప్పున సిబ్బంది ఉన్నారు. వారందరూ దుర్మరణం పాలయ్యారు. ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని భావిస్తోన్నారు. స్థానికులు తమ మొబైల్ కెమెరాల్లో ఈ ఎయిర్ షోను బంధిస్తోండగా.. ఈ ఘటన రికార్డయింది.

సమాచారం తెలిసిన వెంటనే బౌల్డర్ కంట్రీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు మొదలు పెట్టాయి. టెక్సాస్ గవర్నర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. దీన్ని దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+