అయ్యో భగవంతుడా.. ఆకలి తట్టుకోలేక ఇద్దరు చిన్నారులు ఏం చేశారంటే..?

తీవ్రమైన ఆహార కొరత కారణంగా తలెత్తిన హృదయవిదారక పరిస్థితులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఉగాండాలోని కరమోజా సబ్ రీజియన్‌ లో చోటు చేసుకున్న ఒక ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచాన్ని ఏడిపిస్తోంది. ఆ వీడియోలో ఇద్దరు చిన్నారులు తమ ముందు ఉన్న ప్లేటులో సజీవంగా ఉన్న పురుగులను తింటూ కనిపిస్తున్నారు. వారి కళ్లలో ఆకలి, నిరాశ, నిస్సహాయత, భయం, జీవించాలనే ఆరాటం అన్నీ కలగలిపి కనిపిస్తున్నాయి. ఆ పిల్లలు వణుకుతున్న చేతుల తోనే పురుగులను నోట్లో వేసుకుంటుంటే ఎవరికైనా చూడగానే కన్నీళ్లు ఆగవు.

కాగా ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాల్లో కరువు పరిస్థితులు దారుణంగా మారాయి. ముఖ్యంగా ఉగాండాలో ప్రజలు తీవ్రమైన ఆహార కొరతతో అల్లాడుతున్నారు. పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేని దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అక్కడ ప్రజలు ఆహారం కోసం దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పిల్లలు, పెద్దలు సరైన పోషకాహారం లేక ఎముకల గూడులా మారిపోతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.

two-children-eating-live-insects-due-to-hunger-craves-at-karamoja-in-uganda

కాగా కరమోజా ప్రాంతం గత రెండేళ్లుగా తీవ్ర కరువుతో అలముకుందని అంటున్నారు. వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండిపోయి.. ఆహార నిల్వలు తేలిపోయాయి. బతుకు భారమైపోయిన పరిస్థితుల్లో తల్లి తినకపోయినా పర్లేదు కానీ పిల్లలు తిన్నారని ఊరట పొందే పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు. ఆ ప్రాంతంలోని దాత సంస్థల ప్రకారం ఒక్క భోజనం కోసం కుటుంబాలు రెండు రోజులూ వేచి చూడాల్సి వస్తోందని చెబుతున్నారు. చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో క్షీణించి మరణిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆహారం లేక చెట్ల ఆకులు, గడ్డి, చెట్ల పొట్టు కూడా తినడానికి వెనుకాడటం లేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉగాండాలో సుమారు 5 మిలియన్ల మంది ప్రజలు ప్రస్తుతం ఆహార కొరతతో బాధపడుతున్నారు. అందులో సగం మంది పిల్లలేనని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయం తగినంతగా చేరకపోవడంతో పరిస్థితి రోజురోజుకీ విషమమవుతోందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మానవతా సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా "Feed Karamoja" అనే హ్యాష్‌ట్యాగ్‌తో క్యాంపెయిన్ ప్రారంభమైంది. వేలాది మంది ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ సంఘటన మనందరికీ ఒక జ్ఞాపకం కావాలని.. మనం వృథా చేస్తున్న ఒక్క ముద్ద భోజనం, ఎక్కడో ఒక చోట ఒక చిన్నారి ప్రాణాన్ని రక్షించగలదని గుర్తుంచుకోవాలని పిలుపునిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+