ఫిలిప్పీన్స్‌లో రాయ్ టైపూన్ విద్వంసం..100 మంది మృతి..అంధ‌కారంలో 227 న‌గ‌రాలు

ఫిలిప్పీన్స్‌లో టైపూన్ రాయ్ తుపాను విద్వంసం సృష్టించింది. గంట‌ల‌కు 195 నుంచి 270 కిలోమీట‌ర్ల వేగంతో వీచిన పెనుగాలుల‌కు చికురుటాకులా వ‌ణికింది. 227 న‌గ‌రాలతో పాటు గ్రామాల‌ను అంధ‌కారంలోకి నెట్టింది. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప‌లువురి ఆచూకీ గ‌ల్లంతైంది. మృతులు సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆ దేశ అధికారులు వెల్ల‌డించారు.

బీభత్సం సృష్టించిన టైపూన్ రాయ్

బీభత్సం సృష్టించిన టైపూన్ రాయ్

టైపూన్ రాయ్ సృష్టించిన బీభ‌త్సం దాటికి ఇళ్లు, భారీ వృక్షాలు నేల‌మ‌ట్టమ‌య్యాయి. కోలుకోలేని ప‌రిస్థితి నెల‌కొంది. భారీ వ‌ర్షాల‌కు వ‌ర‌దులు ముంచేత్త‌డంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వ‌ర‌ద‌ల్లో ఇళ్లు , కార్లు కొట్ట‌క‌పోయాయి. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తోందోన‌ని జ‌నం బిక్కుమ‌ని కాలం గ‌డుపుతున్నారు. పెనుగాలుల దాటికి విద్యుత్ వ్య‌వ‌స్థ‌, క‌మూనికేష‌న్ వ్య‌వ‌స్థ విద్వంసం అయింది. దాదాపు దేశం మొత్తం అంధ‌కారంలోకి నెట్టింది.

నిరాశ్ర‌యులైన మూడు ల‌క్ష‌ల మంది ప్రజలు

నిరాశ్ర‌యులైన మూడు ల‌క్ష‌ల మంది ప్రజలు

రామ్ తుపాన్ ప్ర‌భావంతో దాదాపు 3ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. వారంద‌రిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. బోహూల్ ద్వీపంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు 49 మంది మృతి చెందార‌ని ఆ ప్రావిన్స్ గ‌వ‌ర్న‌ర్ ఆర్థ‌ర్ యాప్ తెలిపారు. మ‌రో ప‌ది మంది గ‌ల్లంతైన‌ట్లు వెల్ల‌డించారు. బోహోల్ ప్రావిన్స్ లో మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఈ తుపాను సుమారు 8 ల‌క్ష‌ల మందిపై ప్ర‌భావం ప‌డింది.

ఇబ్బందులు పడుతున్న పర్యాటకలు

ఇబ్బందులు పడుతున్న పర్యాటకలు

తుపాను ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. దీని కోసం మిల‌ట‌రీ, కోస్టు గార్డు, పోలీసు, అగ్నిమాప‌క సిబ్బందిని రంగంలోకి దింపిన‌ట్లు చెప్పారు. రాయ్ తుపాను అత్యంత విధ్వంసం సృష్టించిన బోహుల్‌, సియార్గావ్, మిన్డ‌న‌రవ్, డినాగ‌ట్ ద్వీపాలలో ప్ర‌జ‌లకు అవ‌స‌ర‌మైన నిత్యావ‌స‌రాలు, పున‌రావాస సామాగ్రిని త‌ర‌లించిన‌ట్లు వెల్ల‌డించారు. ప‌ర్యాట‌క ప్ర‌దేశ‌మైన ఫిలిప్పిన్స్‌లో క్రిస్మ‌స్ సంబ‌రాల‌ను జ‌రుపుకునేందుకు విదేశాల నుంచి వ‌చ్చిన ప‌ర్యాట‌కులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏటా సగటున 20 తపాన్లు..

ఏటా సగటున 20 తపాన్లు..

ప్ర‌తి ఏటా ఫిలిప్పీన్స్ లో స‌గ‌టున 20 త‌ఫాన్లు సంభ‌విస్తుంటాయి. ఈ దేశంలో మొత్తం 7460 దీవులు ఉన్నాయి. 2013లో హైయ‌న్ టైపూన్ ఆ దేశాన్ని వ‌ణికించింది. ఈ తుపాను దాటికి సుమారు 7300 మంది మృతి చెందారు. తాజా సంభ‌వించిన తుపాను బీభ‌త్సం సృష్టించింది. ల‌క్ష‌లాది మందిని నిరాశ్ర‌యుల‌ను చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+