అరబ్ ఎమిరేట్స్‌కు కొత్త క్రౌన్ ప్రిన్స్
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వారసుడొచ్చాడు. ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ గా షేఖ్ ఖాలిద్ బిన్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమిరేట్స్ అధ్యక్షుడు షేఖ్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్.. ఉత్తర్వులు జారీ చేశారు. షేఖ్ ఖలేద్ మరెవరో కాదు. ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్ బిన్ పెద్ద కుమారుడు. ఆయన నియామకాన్ని ఇతర గల్ఫ్ దేశాలు స్వాగతించాయి. సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, ఒమన్, బహ్రెయిన్.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాయి.
అరబ్ ఎమిరేట్స్‌లో ఒకటైన అబుధాబి పరిపాలన వ్యవహారాలన్నీ కూడా షేక్ ఖాలిద్ పర్యవేక్షించనున్నారు. 1982 జనవరి 8వ తేదీన జన్మించారాయన. షార్జాలోని అమెరికన్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం వార్ స్టడీస్ స్పెషలైజేషన్ గా లండన్ లోని కింగ్స్ కాలేజ్ నుంచి పీహెచ్‌డీ అందుకున్నారు. ఇంతకుముందు- అబుధాబి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్, అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ బోర్డ్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

షేక్ ఖలీద్‌ను క్రౌన్ ప్రిన్స్ గా ఎన్నుకోవడం గల్ఫ్ దేశాల్లో ఆనవాయితీగా వస్తోంది. గల్ఫ్ దేశాలన్నీ కూడా రాచరిక పరిపాలనలో ఉండటమే దీనికి కారణం. ఆయనతో పాటు మరికొన్ని కీలకమైన నియామకాలు పూర్తయ్యాయి. దుబాయ్ అధ్యక్షుడిగా షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్‌తో పాటు అతని సోదరుడు షేక్ మన్సూర్ అరబ్ ఎమిరేట్స్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1971లో షేక్ మహ్మద్ తండ్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫెడరేషన్‌ను స్థాపించారు. అప్పటినుంచి ఆయనే అబుధాబి అధ్యక్షుడిగా ఉన్నారు.
ఇంటెలిజెన్సీ, ఆర్థిక వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ లో షేఖ్ ఖాలిద్ బిన్ మహ్మద్ నిపుణుడు. ఆయన సారథ్యంలో అరబ్ ఎమిరేట్స్ ఆర్థికంగా మరింత బలోపేతమౌతుందనే అంచనా ఉన్నాయి. విదేశాంగ వ్యవహారాలపైనా ఆయనకు గట్టి పట్టు ఉంది. రష్యా, చైనాతో దౌత్య, వ్యాపార, ఆర్థికపరమైన సంబంధాలు మరింత బలోపేతమౌతాయని చెబుతున్నారు. ఆర్థిక స్థిరత్వానికి పెట్టింది పేరు అరబ్ ఎమిరేట్స్. ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయాన్ని కలిగివుందీ దేశం. శ్రామికశక్తిలో తిరుగులేదు. అత్యధిక ప్రవాస కార్మికులకు ఇది కేంద్రబిందువు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications