యూకే డోర్స్ క్లోజ్: భారత్ ఒక్కటే సేఫ్
Sheik Hasina: పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేసిన ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా.. ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల హిండన్ ఎయిర్‌బేస్‌లో తలదాచుకుంటోన్నారు.
బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచీ అల్లర్లు కొనసాగుతూనే వస్తోన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో షేక్ హసీనా అక్రమంగా విజయం సాధించారనేది అక్కడి ప్రజల ఆరోపణ. దీనికితోడు ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాల్లో కోటా వ్యవస్థ.. వంటి ఆమె సారథ్యంలోని ఆవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి దారితీసింది.

సొంతదేశం నుంచి హెలికాప్టర్‌లో పారిపోయిన షేక్ హసీనా భారత్‌కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం ఆమె తొలుత అగర్తల చేరుకున్నారు. అక్కడి నుంచి సీ-30 రకం బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రవాణా హెలికాప్టర్ హెర్కులెస్‌లో హిండన్ ఎయిర్‌బేస్‌కు వచ్చారు.
తొలుత షేక్ హసీనా లండన్‌కు వెళ్లొచ్చంటూ వార్తలొచ్చాయి. అక్కడ ఆమె చెల్లెలు షేర్ రెహానా నివసిస్తోన్నారు. పైగా రెహానాకు బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది. అక్కడ ఆశ్రయం పొందడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అవేవీ ఫలించలేదు. హసీనాకు తమ దేశంలో ఆశ్రయం ఇవ్వదలచుకోలేదని బ్రిటన్ తెలిపింది.
ఆశ్రయం పొందదలిచిన వ్యక్తులు మొదట.. తాము సురక్షిత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. వారి భద్రతకు అది అత్యవసరం బ్రిటన్ వ్యాఖ్యానించింది. ఒక వ్యక్తికి ఆశ్రయం ఇవ్వడం లేదా తాత్కాలిక శరణార్థిగా గుర్తించడానికి తమ దేశ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఎంత మాత్రం అంగీకరించబోవని తేల్చి చెప్పింది.
తమ దేశానికి వచ్చిన వారికి రక్షణ కల్పించడంలో అద్భుతమైన రికార్డు తమకు ఉందని పేర్కొంది. ఆశ్రయం ఇవ్వడానికి లేదా తాత్కాలిక శరణార్థిగా గుర్తించడానికి ఏ దేశమైనా కొన్ని నిబంధనలను అనుసరిస్తుందని గుర్తు చేసింది. తమ నిబంధనలు అందుకు విరుద్ధమని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications