వ్యభిచారంలో కొత్తపుంతలు! సెక్స్ డాల్స్‌తో బ్రోతల్‌హౌస్, ప్రారంభించిన తొలిరోజే..
వాషింగ్టన్: కాలం మారుతోంది. మనుషుల అభిరుచులు కూడా మారుతున్నాయి. చివరికి వ్యభిచారం విషయంలోనూ ఈ మార్పు కనిపిస్తోంది. ఆడవాళ్ల స్థానాన్ని క్రమంగా ఆడ బొమ్మలు ఆక్రమించుకుంటున్నాయి.
చదవండి: టార్గెట్ 2050 : మనిషి గల్లంతే.. భవిష్యత్తులో స్నేహం, ప్రేమ, పెళ్లి అన్నీ వాటితోనే..
అవును, చాలామంది పురుషులు ఇప్పుడు సెక్స్ డాల్స్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయంలో మనకంటే యూరప్ దేశాలు ముందున్నాయి. యూకేలోని స్కాట్లాండ్‌లో ఇలాంటి బొమ్మలతో ఏకంగా బ్రోతల్ హౌస్ పెట్టేశాడో పెద్దమనిషి.

వ్యభిచారానికీ చట్టబద్ధత...
ప్రాచీనకాలం నుంచి వ్యభిచారం ఒక వృత్తిగా సాగుతోంది. ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో ఉండే వేశ్యాగృహాల గురించి మనకు తెలిసిందే. అయితే వ్యభిచారం అనేది మన దేశంలో తప్పు కావచ్చు.. కానీ బ్రెజిల్ లాంటి దేశాల్లో దీనికి చట్టబద్ధత ఉంది. కాకపోతే ఈ వ్యాపారంలోనూ అక్కడి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.. అంతే!

మనుషులతో రిస్కే...
అయితే మనుషులతో సాగే శృంగారంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రిస్క్ మాత్రం తప్పదు. ఇటు వ్యభిచార గృహాల నిర్వహణ పరంగా ఎదురయ్యే ఇబ్బందులు, అటు సుఖ వ్యాధులు.. ఇలాంటి సమస్యలెన్నో! విశృంఖల శృంగారం ఎవరికీ శ్రేయస్కరం కాదు. సరిగ్గా ఈ ఆలోచనే ఓ కొత్త వ్యాపారానికి బాటలు వేసింది.

సెక్స్ డాల్స్‌తో బ్రోతల్ హౌస్...
ఇప్పుడు వ్యభిచారంలోనూ రిస్క్ పెద్దగా ఉండని ‘సెక్స్ డాల్స్ ' ప్రవేశించాయి. స్కాట్లాండ్‌కు చెందిన స్టీవెన్ క్రాఫోర్డ్(25) ఇటీవల ‘డేట్ ఎ డాల్ సర్వీసెస్ లిమిటెడ్' పేరిట ఈ సెక్స్ డాల్స్‌తో ఏకంగా ఓ బ్రోతల్ హౌస్ ప్రారంభించాడు. ఓ 60 పౌండ్లు చెల్లించి అచ్చు అమ్మాయిని తలపించే బొమ్మతో గంట సేపు శృంగారాన్ని అస్వాదించండి.. అంటూ ప్రకటనలు గుప్పించాడు. అతడి ప్రకటన పలువురు పురుషపుంగవులను ఆకర్షించింది. క్యూ కట్టేశారు.

ప్రారంభించిన రోజే...
అయితే స్టీవెన్ క్రాఫోర్డ్ సాగిస్తున్న ఈ వ్యవహారం చుట్టుపక్కల వారికి నచ్చలేదు. ‘ఇళ్ల మధ్య ఈ పనులేంటయ్యా..'అంటూ అతడికి క్లాస్ పీకారు. దీంతో అతడి సరికొత్త వేశ్యాగృహం ప్రారంభించిన రోజే మూతపడింది. దీంతో స్టీవెన్ క్రాఫోర్డ్ తన ప్లాన్ మార్చాడు. ‘ఇంటికి విటులను పిలిస్తేనే కదా ఈ తంటా.. బొమ్మలనే అద్దెకిస్తే పోయె' అనుకుని.. స్టీవెన్ క్రాఫోర్డ్ ప్లాన్ మార్చి మరో ప్రకటన చేశాడు.

గంటకింత చొప్పున అద్దెకు...
‘ఒక్కో బొమ్మను గంటకింత చొప్పున అద్దెకిస్తా.. తీసుకెళ్లి ఎంజాయ్ చేయండి.. మళ్లీ బొమ్మను తీసుకొచ్చి అప్పగిచ్చేయండి..' అంటూ ఆఫర్ మార్చాడు. అంతేకాకుండా, కస్టమర్ల వద్దకు తానే వెళ్లి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎవరైనా బొమ్మని తిరిగివ్వకుండా ఉంచేసుకుంటే.. ఈ ఆలోచన వచ్చిందే తడవు.. బొమ్మకు డిపాజిట్ కూడా పెట్టేశాడు. భవిష్యత్తులో రోబోలతో వేశ్యాగృహం నిర్వహించడం అతడి లక్ష్యమట.. బాగానే ఉంది కదూ కొత్త వ్యాపారం!
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications