కాల్పుల విరమణ: ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలుపు
ఉక్రెయిన్ సంక్షోభం సమసిపోయేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే బైడెన్ ఎంట్రీ ఇచ్చారు. పుతిన్‌తో డిస్కష్ చేస్తానని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఉక్రెయిన్ కూడా స్పందించింది. ఉక్రెయిన్ నుంచి విడిపోయిన రెండు ప్రాంతాల వేర్పాటువాద నాయకులు యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉక్రెనియన్ దళాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చాయి.

ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అనూహ్యంగా ఆ ప్రాంతంలో తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. ఈ మేరకు త్రైపాక్షిక బృంద సమావేశంలో రష్యా, ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో-ఆపరేషన్ ఇన్ యూరప్ (ఓఎస్‌ఈ)తో పాటు ఉక్రెయిన్ కూడా శాంతిచర్చలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. తాము ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మొగ్గు చూపుతామని అన్నారు. ప్రస్తుతం తాము త్రైపాక్షిక సమావేశానికి మద్దతు ఇవ్వడమే కాక ఘర్షణ లేని పాలనను తక్షణమే అమలు చేస్తామని జెలెన్స్కీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇటె తూర్పు యుక్రెయిన్ లో కాల్పుల మోత మోగుతుండగా.. మరోవైపు శాంతి చర్చల దిశగా అడుగులు పడుతున్నాయి. రష్యా.. యుక్రెయిన్‌ను దెబ్బ తీసి కానీ ఊరుకోదని అమెరికా అధినేత బైడెన్ ప్రకటించిన తర్వాత.. యుక్రెయిన్ సంక్షోభం నివారించేందుకు, ఉద్రిక్తతలు తగ్గించేందుకు రష్యా అధినేత పుతిన్‌తో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ భేటీ కానున్నాడని అమెరికా వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. పొరుగు దేశంపై రష్యా దండయాత్రను ఆపేందుకు.. జో బైడెన్ నేరుగా రంగంలోకి దిగబోతున్నాడని అమెరికాకు చెందిన ఉన్నత అధికారి ఒకరు అఫీషియల్ గా ప్రకటించారు. రష్యా- యుక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితి పరిణామాలను సీరియస్‌గా అమెరికా పరిగణిస్తోందని స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు.












Click it and Unblock the Notifications