మరోసారి ట్రంప్ - జెలెన్‌స్కీ భేటీ.. యుద్ధం త్వరగా ముగియాలని వ్యాఖ్య !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి వైట్‌హౌస్ వేదికగా సమావేశం కానున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాల్లో ఇది కీలక ఘట్టమని భావిస్తున్నారు. రాయిటర్స్ సమాచారం ప్రకారం, సోమవారం మధ్యాహ్నం 1:15 (స్థానిక సమయం)కి ట్రంప్-జెలెన్‌స్కీ ద్వైపాక్షిక సమావేశం వైట్‌హౌస్‌లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఇది రాత్రి 10:45 గంటలకు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ట్రంప్ యూరోపియన్ నాయకులతో బహుపాక్షిక సమావేశంలో పాల్గొననున్నారు.

గత సమావేశం..

ఫిబ్రవరిలో జరిగిన సమావేశం ఇద్దరి మధ్య హాట్‌హాట్ చర్చలకు దారితీసింది. ట్రంప్, ఉపాధ్యక్షుడు JD వాన్స్ జెలెన్‌స్కీపై అమెరికన్ సహాయానికి కృతజ్ఞత చూపలేదని విమర్శించారు. జెలెన్‌స్కీ అయితే “పుతిన్‌ను ఇప్పుడు బుజ్జగిస్తే, భవిష్యత్తులో అమెరికా కూడా దాని ఫలితాలు అనుభవిస్తుంది” అని వ్యాఖ్యానించడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యం వల్ల తాజా సమావేశంపై మరింత ఆసక్తి పెరిగింది.

ukraine-president-zelensky-visits-washington-dc-to-meet-trump

యూరోపియన్ నేతల భాగస్వామ్యం

జెలెన్‌స్కీతో పాటు ఈసారి పలు ఐరోపా దేశాల నాయకులు కూడా వాషింగ్టన్‌లో సమావేశమవుతున్నారు. వారిలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్‌రిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, NATO సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఉన్నారు. ఈ భాగస్వామ్యం రష్యాపై ఒత్తిడిని పెంచి శాంతి చర్చలకు దారి తీసే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

జెలెన్‌స్కీ సందేశం – యుద్ధం త్వరగా ముగియాలి..

వాషింగ్టన్ చేరుకున్న అనంతరం జెలెన్‌స్కీ తన సందేశంలో.. “ఈ యుద్ధం త్వరగా, విశ్వసనీయంగా ముగియాలి. శాంతి శాశ్వతంగా ఉండాలి. గతంలో క్రిమియాను వదులుకోవడం పెద్ద తప్పిదమైంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి మళ్ళీ జరగకూడదు. మా ప్రజలు స్వేచ్ఛ, భూభాగం కోసం పోరాడుతున్నారు.” అని అన్నారు.

రష్యా దాడి ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఐరోపా నేతలు కలిసి జరిపే చర్చలు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+