యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో జెలెన్ స్కీ ప్రసంగం: రష్యా దురాగతంపై ప్రకటన
రష్యా దుందుకుడు చర్యలు కొనసాగిస్తోంది. తూర్పు ఉక్రెయిన్‌లో తన సేనలను మొహరించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ కూడా అదేవిధంగా స్పందిస్తోంది. రష్యాను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాట్లాడనున్నారు. తమ దేశంపై రష్యా చర్యలను ఎండగడతారు.
రష్యా దాడి జరిగిన నష్టాన్ని వివరిస్తారు. ప్రజలు కూడా చనిపోయారని.. తమ దేశం రూపురేఖలు మారిపోయాయని చెబుతారు. బుచాలో రష్యా సేనలు.. ఉక్రెయిన్ పౌరులపై మారణహోమం గురించి ప్రధానంగా జెలెన్ స్కీ ప్రస్తావిస్తారు. కివ్‌లో కూడా వందలాది మంది మృతదేహాలతో ఆ ప్రాంతం బీతావాహంగా మారింది. కొందరు అతీ సమీపం నుంచి కాల్పడంతో శరీరంగా తునతునకాలుగా మారిన దృశ్యాలు కనిపించాయి.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కంటిన్యూ అవుతున్నాయి. ఇటీవల జరిగిన చర్చలు తాత్కాలికంగా ఫలించిన.. మొత్తం రష్యా సేనలు మాత్రం ఉక్రెయిన్ విడిచి వెళ్లలేదు. ఈ క్రమంలో అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా వేలాది మంది సైనికులను మోహరించిందని అమెరికా ఆరోపించింది. తూర్పుతోపాటు దక్షిణ భాగంపై కూడా ఫోకస్ చేసిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతీయ భద్రతా సలహాదారు జేమ్ సుల్లీవన్ పేర్కొన్నారు. రష్యా యుద్ద లక్ష్యాలను క్రమంగా తగ్గించుకుంటుందని విశ్వాసిస్తున్నామని తెలిపారు.
రష్యా దాడితో అందమైన ఉక్రెయిన్ దేశ స్వరూపం మారిపోయింది. ఎక్కడ చూసినా మృతదేహల దిబ్బగా మారింది. దాడులతో అందమైన ప్రాంతాలు కాస్త.. చిద్రమైపోయాయి. చాలా మంది.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దేశం వదిలి వెళ్లిపోయారు. విదేశాలకు చెందిన చాలా మంది.. యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications