Russia Ukraine Crisis : ఎమర్జెన్సీ దిశగా ఉక్రెయిన్-ఇవాళ రాత్రికి ఐరాస అత్యవసర భేటీ

ఓవైపు రష్యా దూకుడు, మరోవైపు దాన్ని అడ్డుకునేందుకు పశ్చిమ దేశాల ఆంక్షల మధ్య నలిగిపోతున్న ఉక్రెయిన్ పరిస్ధితుల్ని అదుపులోకి తెచ్చేందుకు అత్యవసర పరిస్దితి విధించాలని ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా దండయాత్రతో పెరుగుతున్న ముప్పుకు ప్రతిస్పందనగా జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే ప్రణాళికలను ఉక్రెయిన్ భద్రతా మండలి ఇవాళ ఆమోదించింది. పార్లమెంటు అధికారికంగా ఆమోదించాల్సిన ఈ చర్యకు స్టెప్-అప్ డాక్యుమెంట్, వాహన తనిఖీలు అవసరమని ప్రభుత్వం తెలిపింది.

ఉక్రెయిన్ పార్లమెంటుకు భద్రతా మండలి నివేదికను అందజేయనుంది. ఈ వారంలో అదనపు భద్రతా చర్యలను చట్టసభ సభ్యులు ఆమోదించే అవకాశం ఉంది.2014లో 14 వేల మందికి పైగా ప్రాణాలను బలిగొన్న ఘోరమైన తిరుగుబాటు ఉక్రెయిన్‌లోని రెండు రష్యా-మద్దతుగల తూర్పు వేర్పాటువాద ప్రాంతాలకు మినహా అన్ని ప్రాంతాలకు ఇవి వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఇది కొన్ని రకాల రవాణాను పరిమితం చేయడంతో పాటు వాహనాల తనిఖీలను పెంచడం , వాహన పత్రాన్ని చూపించమని ప్రజలను అడగడం వంటివి ఇందులో ఉండొచ్చని అధికారులు చెప్తున్నారు.

Ukraine to impose state of emergency amid tensions with Russia

ఉక్రెయిన్ పై దండయాత్రకు రష్యా సిద్ధమవుతుండటం, తమ దేశంలోని రెండు వేర్పాటు వాద ప్రాంతాలను రెండు దేశాలుగా గుర్తిస్తూ రష్యా నిర్ణయంతీసుకోవడం ఉక్రెయిన్ పై ఒత్తిడి పెంచుతోంది. ఎంత పాశ్చాత్యదేశాల మద్దతు ఉన్నా రష్యాదూకుడు కారణంగా పరిస్దితులు మరింత దిగజారకుండా ఉక్రెయిన్ అత్యవసర పరిస్ధితి విధించాల్సిన అవసరం ఏర్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై ఐరాస సాధారణ సభ ఇవాళ రాత్రికి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అటు ఉక్రెయిన్ విషయంలో అమెరికా వ్యవహరిస్తున్నతీరుపై చైనా మండిపడింది. ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యాపై ఆంక్షలు విధిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చైనా విదేశాంగశాఖ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+