ఎబోలా: ఐరాస ఉద్యోగి మృతి, లవర్‌ని తోసేసిన ప్రియుడు
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఐక్యరాజ్య సమితికి చెందిన ఉద్యోగి పశ్రిమాఫ్రికాలో భయంకరమైన ఎబోలా వ్యాధి బారిన పడి చికిత్స కోసం గత వారం జర్మనీ వచ్చారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు జర్మనీలోని లీప్జెక్ ప్రాంతంలోని సెయింట్ జార్జి క్లినిక్ వెల్లడించింది.
ఎబోలా వైరస్‌కు అత్యంత అధునాతతన పద్దతిలో చికిత్స అందించినప్పటికీ వ్యాధి తీవ్రత ఎక్కువ అవడంతో మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎబోలా బారిన పడి మృతిచెందిన వారి సంఖ్య నాలుగువేలు దాటిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. ఇప్పటివరకు 4033 మంది చనిపోయినట్టు తెలిసిందని, ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు చెప్పారు.

ఇటీవల కెన్యాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఎబోలా వ్యాధితో చనిపోయిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం చిదిపిరాళ్లకు చెందిన గజేంద్రరెడ్డి విష జ్వరంతో కెన్యాలో మరణించాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న గజేంద్రరెడ్డికి విషజ్వరంతో పాటు ఒళ్లంతా బొబ్బలు రావడంతో చనిపోయాడు. ఆయనకు చికిత్స చేసిన డాక్టరు కూడా చనిపోయినట్లు సమాచారం.
నైరోబీలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. ఆగస్టు 4వ తేదీన గజేంద్ర రెడ్డి ఆగాఖాన్ ఆస్పత్రిలో చేరాడు. ఆగస్టు 14వ తేదీ నుంచి కోమాలోకి వెళ్లిపోయిన అతను 18వ తేదీన మరణించాడు.
హైదరాబాదులో దారుణం
హైదరాబాదులో ఓ యువకుడు తన ప్రియురాలిని భవనం పై నుండి తోసేశాడు. ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు చిలకలగూడ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.












Click it and Unblock the Notifications