భారత్-పాక్ యుద్ధం వస్తుందా ? ఐరాస అంచనా ఇదే..!

జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఇవాళ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా స్పందించింది. ఈ దాడిని తీవ్ర పదజాలంతో ఖండించింది. ఈ దాడి కారకుల్ని, వారి వెనుక ఉన్న వారిని చట్టం ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చింది. 15 దేశాలతో కూడిన భద్రతామండలి దీనిపై ఇవాళ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది.

భద్రతా మండలిలో సభ్యదేశాలన్నీ ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఉగ్రవాద చర్యకు పాల్పడిన వారిని, నిర్వాహకులను, ఆర్థిక సహాయం అందించేవారిని, స్పాన్సర్‌లను జవాబుదారీగా ఉంచి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరాన్ని భద్రతా మండలి సభ్యులు నొక్కి చెప్పారని ప్రకటన తెలిపింది. అంతర్జాతీయ చట్టం, సంబంధిత భద్రతా మండలి తీర్మానాల ప్రకారం అన్ని దేశాలు తమ బాధ్యతలకు అనుగుణంగా ఈ విషయంలో అన్ని సంబంధిత అధికారులతో చురుకుగా సహకరించాలని కోరింది.

UN Security Council strongly condemned pahalgam attack respond to possibility of indo-pak war

ఏప్రిల్ నెలకు ఫ్రాన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఐక్యరాజ్యసమితి రాయబారికి ఫ్రాన్స్ శాశ్వత ప్రతినిధి కౌన్సిల్ అధ్యక్షుడు జెరోమ్ బోనాఫాంట్ ఈ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఇందులో ఐరాసలో అమెరికా ముసాయిదా ప్రకటనను ప్రవేశపెట్టిందని, దీనిపై కౌన్సిల్ సభ్యులు చర్చించారని తెలిపింది. పాకిస్తాన్ ప్రస్తుతం అమెరికా భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉంది. దీంతో పాకిస్తాన్ కూడా ఈ చర్చల్లో పాల్గొని ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది.

UN Security Council strongly condemned pahalgam attack respond to possibility of indo-pak war

భద్రతా మండలి సభ్యదేశాలు బాధితుల కుటుంబాలకు, భారత, నేపాల్ ప్రభుత్వాలుకు తమ ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారని ప్రకటన తెలిపింది. ఉగ్రవాదం దాని అన్ని రూపాలు, వ్యక్తీకరణలలో అంతర్జాతీయ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పుగా ఉందని భద్రతా మండలి సభ్యులు తెలిపారు. ఉగ్రవాదం యొక్క ఏదైనా చర్యలు నేరపూరితమైనవని, అన్యాయమైనవి వారు తెలిపారు.

మరోవైపు భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితిపై సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందిస్తూ తాము దీని పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన దాడులను ఖండిస్తున్నామని, పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకోవడానికి గరిష్ట సంయమనం పాటించాలని భారత్, పాక్ ప్రభుత్వాలను కోరారు. ప్రస్తుతం పోప్ అంత్యక్రియలకు వెళ్లిన ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరెస్.. తిరిగొచ్చాక భారత్, పాక్ లతో పరిణామాలపై చర్చించనున్నారు. అయితే ఈ రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగవచ్చనే ప్రచారాన్ని మాత్రం తోసిపుచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+