వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమ్మలేని నిజం: 411రోజుల తర్వాత కరోనా బారి నుండి కోలుకున్న వ్యక్తి

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నివారణ కానప్పటికీ ప్రపంచంలో అన్ని దేశాలలోనూ దాదాపుగా కంట్రోల్ లోకి వచ్చింది. ముఖ్యంగా భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. అయితే కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ లో కరోనా బారిన పడిన ఓ వ్యక్తి 411 రోజుల తర్వాత ప్రస్తుతం కోలుకున్నారు. ఇది మీకు నమ్మశక్యంగా లేకున్నా నిజం.

సుదీర్ఘ కాలం కరోనాతో పోరాటం చేసిన బ్రిటన్ వ్యక్తి

సుదీర్ఘ కాలం కరోనాతో పోరాటం చేసిన బ్రిటన్ వ్యక్తి


కరోనా మహమ్మారి నుంచి బయటపడటానికి బ్రిటన్ కు చెందిన 59 ఏళ్ల వ్యక్తి సుదీర్ఘ కాలం పోరాటం జరిపాడు. రోగికి ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ, అతను జనవరి 2022 వరకు కోవిడ్‌కు పాజిటివ్ పరీక్షించడాన్ని కొనసాగించాడని సమాచారం. సదరు వ్యక్తి ఏకంగా 411 రోజులు కరోనా మహమ్మారి కి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అతను చాలా బలహీనమైన ఇమ్యూన్ సిస్టమ్ ను కలిగి ఉన్నాడని, అతను ఒక మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారని వైద్యులు చెబుతున్నారు.

పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ బారినపడిన్ బ్రిటన్ వ్యక్తి.. 411 రోజుల తర్వాత నార్మల్ గా

పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ బారినపడిన్ బ్రిటన్ వ్యక్తి.. 411 రోజుల తర్వాత నార్మల్ గా


కరోనా ఫస్ట్ వేవ్ లో డిసెంబర్ 2020లో కరోనా సోకిన సదరు వ్యక్తి అప్పటి నుండి సుదీర్ఘకాలంపాటు చికిత్స పొందుతూనే ఉన్నారు. ఆయన పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ బారినపడి లాంగ్ కోవిడ్ తో చాలా కాలం బాధ పడ్డారు. చావు దగ్గరకు వెళ్లి వచ్చారు. వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించడం ద్వారా అతనికి కోవిడ్ ను నయం చేశారు బ్రిటన్ వైద్యులు. దాదాపు 411 రోజుల సుదీర్ఘ పోరాటం తర్వాత అతను కోలుకున్నారు.

న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ తో కరోనా తగ్గించిన వైద్యులు

న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ తో కరోనా తగ్గించిన వైద్యులు


జన్యు విశ్లేషణను ఉపయోగించి, వైద్యులు 59 ఏళ్ల కరోనా మహమ్మారి బారిన పడిన వ్యక్తి ఇప్పటికీ అసలు వుహాన్ జాతికి ప్రారంభ రూపాన్ని కలిగి ఉన్నారని నిర్ధారించారు. లండన్ వైద్య నిపుణులు మనిషిని న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ మిశ్రమంతో నయం చేయగలిగారు. ఇది ప్రారంభ కరోనావైరస్ వేరియంట్‌లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నారు .

యూకేలో లాంగ్ కోవిడ్ బాధితులు ఇలా

యూకేలో లాంగ్ కోవిడ్ బాధితులు ఇలా

కరోనా ఇన్ఫెక్షన్ ఉన్న సందర్భాల్లో, కొంతమంది రోగులలో నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం లక్షణాలను ప్రదర్శించవచ్చు కానీ పరీక్ష చేసినప్పటికీ పాజిటివ్ గా నిర్ధారణ కాదని చెబుతున్నారు. లాంగ్ కోవిడ్‌ కరోనా మహమ్మారికి భిన్నంగా ఉంటుంది. యూ కెలో, ప్రభుత్వ గణాంకాలు అంచనా వేసిన 2.1 మిలియన్ల మంది ఉన్న జనాభాలో 3.3 శాతం మంది దీర్ఘకాల కోవిడ్‌తో బాధపడుతున్నారని నివేదించింది.

12న తెలంగాణాకు ప్రధాని మోడీ రాక.. రామగుండం ఆర్‌ఎఫ్సీఎల్‌ జాతికి అంకితం!!12న తెలంగాణాకు ప్రధాని మోడీ రాక.. రామగుండం ఆర్‌ఎఫ్సీఎల్‌ జాతికి అంకితం!!

English summary
A 59-year-old man from Britain has recovered from Corona after 411 days of long Covid-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X