హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ బిగ్ షాక్!
ఇస్లామాబాద్ : ఎట్టకేలకు ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కర్-ఇ-తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ బిగ్ షాక్ ఇచ్చింది. హఫీజ్‌ను ఉగ్రవాదిగా గుర్తిస్తూ... అతనికి సంబంధించిన సంస్థలపై నిషేధం విధించింది.
గతంలో ఐక్యరాజ్యసమితి హఫీజ్‌కు చెందిన లష్కర్-ఇ-తాయిబా, జమాత్ ఉద్ దవా సంస్థలపై పాక్షిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలోనే ఆయా సంస్థలకు నిధుల సేకరణ అనుమతికి నిరాకరించిన పాక్.. ఇప్పుడు వాటిపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

ముంబై దాడులకు హఫీజ్ ప్రధాన సూత్రధారి. అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా హఫీజ్‌ను గుర్తించి అతనిపై 10 మిలియన్ డాలర్ల నజరానాను కూడా ప్రకటించింది. ఐరాస ఒత్తిడి మేరకు 297 రోజులపాటు అతన్ని పాకిస్తాన్ గృహ నిర్భంధంలో కూడా ఉంచింది.
అయితే ఆ తరువాత లాహోర్ కోర్టు ఆదేశాల మేరకు హఫీజ్ సయీద్‌ను గృహనిర్బంధం నుంచి విడుదల చేయాల్సి వచ్చింది. అయితే పాక్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారుతున్న తరుణంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హఫీజ్ సయీద్‌కు ఊహించని దెబ్బే.
1997 ఉగ్రవాద వ్యతిరేక చట్టానికి సవరణలు చేసిన పాకిస్తాన్.. తాజాగా మొత్తం 27 సంస్థలను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. గత వారమే అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ పై సంతకం చేసినప్పటికీ.. అధికారులు సోమవారం ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఈ ఆర్డినెన్స్ అమలులోకి రావడంతో తక్షణమే హఫీజ్ సయీద్‌కు చెందిన సంస్థలపై ఈ నిషేధం అమలులోకి వచ్చినట్లు ప్రకటించారు. అయితే హఫీజ్‌ను అరెస్ట్ చేసే విషయంపై మాత్రం పాక్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
-
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
HIV : 300కు పైగా చిన్నారులకు హెచ్ఐవి - డాక్టర్ నిర్లక్ష్యమే కారణం..!! -
ఒక్క దెబ్బతో దివాలా తీసిన పాకిస్థాన్.. చరిత్రలో తొలిసారి ఆ పని చేసేందుకూ రెడీ.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం












Click it and Unblock the Notifications