పాకిస్తాన్ కు ముల్లు గుచ్చుకుంటే ట్రంప్ కంట్లో నీళ్లొస్తోన్నాయిగా: అడిగిందే తడవుగా

పాకిస్తాన్ కు కంట్లో నలుసుగా మారిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీపై అమెరికా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. బలోచ్ వేర్పాటువాద సంస్థను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ స్వాగతించింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపింది.

బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), దాని పోరాట విభాగం మజీద్ బ్రిగేడ్‌లను ఉగ్రవాద సంస్థలుగా గుర్తిస్తూ అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఘోరమైన దాడులే దీనికి కారణమని తెలిపింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటన ముగిసిన వెంటనే ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

United States has designated a BLA as a Foreign Terrorist Organization

తన అమెరికా పర్యటన సందర్భంగా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మజీద్ బ్రిగేడ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థ (FTO)గా గుర్తించాలని అసీమ్ మునీర్.. కోరారు. దీనికి అనుగుణంగా తాజా ప్రకటన వెలువడింది. మజీద్ బ్రిగేడ్‌ను స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT) గా గుర్తించింది.

2019లో మొదటిసారి బలోచ్ లిబరేషన్ ఆర్మీని స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ గా గుర్తించింది అమెరికా. అప్పటి నుండి ఈ సంస్థ, మజీద్ బ్రిగేడ్ మరిన్ని ప్రాణాంతక దాడులు, మారణకాండకు పాల్పడినట్లు అమెరికా పేర్కొంది. 2024లో కరాచీ విమానాశ్రయం, గ్వాదర్ నౌకాశ్రయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడులకు బీఎల్ఏ బాధ్యత వహించిన విషయాన్ని గుర్తు చేసింది.

అలాగే- ఈ ఏడాది పాకిస్తాన్ లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా హైజాక్ చేసిందని వివరించింది. ఈ ఘటనలో 31 మంది పౌరులు, భద్రతా సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. 300 మందికి పైగా ప్రయాణికులను అప్పట్లో బందీలుగా పట్టుకుంది బలోచ్ ఆర్మీ. ఈ వివరాలు అన్నింటినీ కూడా తన తాజా ప్రకటనలో పొందుపరిచింది అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ.

ఈ ప్రకటనతో.. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్.. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కట్టుబడి ఉందని మరోసారి రుజువు చేసినట్టయిందని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించబోమని స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వివిధ దేశాలు నిర్వహించే పోరాటాలకు అండగా నిలుస్తామని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ స్వాగతించింది. డొనాల్డ్ ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపింది.

కాగా- బలోచిస్తాన్ లిబరేషన్ నుంచి గానీ.. దాని అనుబంధ సంస్థల నుంచి గానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రతిస్పందన వెలువడలేదు. బలోచిస్తాన్‌ ప్రావిన్స్ లో ఖనిజ వనరుల వెలికితీతను అక్కడి లిబరేషన్ ఆర్మీ వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఆర్మీపై తరచూ దాడులు చేస్తూ వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+