ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఒంటరైన పాకిస్థాన్.. చైనా మినహా మద్దతు లేని పాకిస్థాన్

అంతర్జాతీయ సమాజంలో కూడ పాకిస్థాన్‌ ఒంటరి అయింది. కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపై పాకిస్థాన్ పిర్యాధు మేరకు అంత్యవసరంగా సమావేశమైన యూఎన్ సెక్యూరిటి కౌన్సిల్ సమావేశంలో పాకిస్థాన్‌కు అనుకూలంగా కేవలం చైనా మాత్రమే మద్దతు పలికింది. కాగా రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని రష్యా కోరింది. అనధికారిక సమావేశంలో ఎలాంటీ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే సమావేశంలో హిడెన్ ఎజెండా ఏది లేదని, ఇస్లామాబాద్‌తో పాటు ఢిల్లిలు పరస్పరం చర్చించుకోవాలని రష్యా సూచించింది.

ఐరాస దృష్టికి కశ్మీర్ అంశాన్ని తీసుకెళ్లిన పాకిస్థాన్

ఐరాస దృష్టికి కశ్మీర్ అంశాన్ని తీసుకెళ్లిన పాకిస్థాన్

కశ్మీర్ పరిణామాలపై పాకిస్థాన్ అంతర్జాతీయ స్థాయిలో తమతో స్నేహం చేస్తోన్న చైనా దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లింది.దీంతో పాటు అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోన్‌లో మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దయిన కొద్దిరోజుల్లోనే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ చైనా వెళ్లారు. ఆ దేశ ప్రభుత్వ నేతలతో సమావేశమయ్యారు. ఆ తరువాతే అంతర్జాతీయ స్థాయిలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయ్యే పరిస్థితి తలెత్తింది. పాకిస్తాన్ చేసిన ఫిర్యాదు పత్రాన్ని ఆయన ఆ దేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడికి అందజేశారు. ఇదే విషయాన్ని ఐక్యరాజ్య సమితిలోని పోలండ్ రాయబారి జొవాన్నా వ్రొనెక్కా దృష్టికీ తీసుకెళ్లారు. ఆ తరువాతే భద్రతా మండలి సమావేశం కావాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్‌కు మద్దతు పలికిన చైనా...

పాకిస్థాన్‌కు మద్దతు పలికిన చైనా...

కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లడంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన నేపథ్యంలోనే పాకిస్థాన్ ఒంటరిగానే మిగిలింది...సమావేశంలో చైనా మినహా ఇతర సభ్యదేశాలు పెద్దగా స్పందించలేదని సమాచారం. ఆనేపథ్యంలోనే అగ్రరాజ్యల మద్దతు కూడ పాకిస్థాన్‌కు కరువయింది. ఇక ఈ సమావేశంలో చైనా పూర్తిగా పాకిస్థాన్‌కు మద్దతు పలికింది. ఈనేపథ్యంలోనే కశ్మీర్ అంశంపై ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరైన పద్దతి కాదంటూ చైనా వాదించింది. దీంతో భారత ఉప ఖండంలో ఉద్రిక్తలు పెరగకుండా రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించింది.

ఇరు దేశాల ద్వైపాక్షిక అంశమని చెప్పిన రష్యా,

ఇరు దేశాల ద్వైపాక్షిక అంశమని చెప్పిన రష్యా,

ఇక రష్యా మాత్రం కశ్మీర్ అంశం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశమని రష్యా అభిప్రాయం వ్యక్తం చేసింది. రెండు దేశాలు కూడ శాంతిపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.. దీంతో పాటు భారత్, చైనా రెండు తమకు మిత్ర దేశాలే అని పేర్కోంది, ఇక తమకు ఎటువంటి రహస్య ఎజెండాలు లేవని చెప్పింది. సిమ్లా ఒప్పందంతో పాటు,లాహోర్ డిక్లరేషన్ ప్రకారం ఇరు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని సూచిందింది. రెండు దేశాల మధ్య సామరస్య వాతవరణం కొనసాగే విధంగా తమవంతు సహయం చేస్తామని రష్యా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+