ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడులకు దిగిన అమెరికా.. వారికి ట్రంప్ వార్నింగ్!

నైజీరియాలో ఉగ్రవాదుల పైన అమెరికా భీకర దాడులు మొదలుపెట్టింది. ఉగ్రవాదాన్ని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న అమెరికా నైజీరియాలో ఉగ్ర మూకలపై విరుచుకుపడింది. నైజీరియాలో ఇస్లామిక్ స్టేట్ ఐసీసీ ఉగ్రవాదుల పైన దాడులు జరుపుతున్న అమెరికా క్రైస్తవులపై జరుగుతున్న హింసను నియంత్రించడమే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్టు పేర్కొంది. ఇక ఈ విషయాన్ని డోనాల్డ్ ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

నైజీరియాలో ఉగ్రవాదులపై యూఎస్ దాడులు
ట్రంప్ తన పోస్టులో నైజీరియా పై జరుగుతున్న దాడులపై ఈ విధంగా పేర్కొన్నారు. నైజీరియాలో ఐసిస్ ఉగ్రవాదుల పైన యూఎస్ఏ శక్తివంతమైన దాడులను ప్రారంభించింది అన్నారు. ప్రధానంగా అమాయకులైన క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని దారుణంగా చంపుతున్న వారిపైన ఈ దాడులు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తానని గతంలోనే హెచ్చరించానన్నారు.

US Attacks ISIS in Nigeria to Curb Violence Against Christians Trump warning tweet

రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించబోమన్న ట్రంప్
తన హెచ్చరికలు వారు పట్టించుకోలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పుడు వారు అనుభవిస్తున్నారు అంటూ ఆయన తన పోస్టులో రాసుకొచ్చారు. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని సహించబోమని ట్రంప్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. మరణించిన ఉగ్రవాదులతో సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న డోనాల్డ్ ట్రంప్, హింస కొనసాగితే దాడులు నిరంతరంగా కొనసాగుతాయి అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

వారికి అమెరికా తీవ్ర హెచ్చరిక
ఐసిస్ అనుబంధ వర్గాలు, బోకో హరామ్ వంటి తీవ్ర ఉగ్రవాద మూకల నుండి నైజీరియా దీర్ఘకాలంగా అభద్రతను ఎదుర్కొంటోంది. నైజీరియా అధికారుల అభ్యర్థనతో దాడులు చేసి పలువురు ఉగ్రవాదులను అంతం చేస్తామని అమెరికా సైన్యం ప్రకటించింది. అయితే 2020 లోనే అమెరికా నైజీరియా ను ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో చేర్చింది.

క్రిస్మస్ సాక్షిగా తాజా దాడులు
ఇక నైజీరియాలో క్రైస్తవుల పైన ఉగ్రవాదులు జరుపుతున్న భీకర మారణ హోమం నేపథ్యంలో క్రైస్తవులపై హింసను ఎదుర్కొనే సైనిక ప్రణాళికలకు గత నవంబర్ లోనే ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ ఆదేశాల ఫలితంగానే క్రిస్మస్ సాక్షిగా తాజా దాడులు కొనసాగుతున్నాయి. వారికి ఈ దాడులతో సీరియస్ వార్నింగ్ ఇచ్చారుఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+