వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌కు దిమ్మతిరిగే షాక్: ఇక నుంచి ఆర్థిక సహాయం ఉండదన్న అమెరికా..

ఈ మేరకు పాకిస్తాన్‌కు నిధులు నిలిపివేస్తున్నామని తాజాగా అమెరికా ప్రకటించింది.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్‌కు అమెరికా నుంచి గట్టి షాక్ ఎదురైంది. ఉగ్రవాద నిరోధం పేరుతో అభివృద్ధి చెందిన దేశాల నుంచి నిధులు సేకరిస్తూ వాటిని దుర్వినియోగం చేస్తున్న పాక్ కు ఇక అమెరికా నుంచి నిధులు అందవు.

ఈ మేరకు పాకిస్తాన్‌కు నిధులు నిలిపివేస్తున్నామని తాజాగా అమెరికా ప్రకటించింది. పాకిస్తాన్‌కు అందించాల్సిన 50మిలియన్ డాలర్ల(రూ.322కోట్లను) నిలిపివేస్తున్నామని పెంటగాన్ అధికారులు తెలిపారు. ఉగ్రవాద నిరోధానికి పాకిస్తాన్‌కు ఇదివరకే నిధులు ఇచ్చామని, కానీ దానివల్ల ఎలాంటి ఫలితం లేదని అమెరికా అంటోంది.

US blocks $350 million aid to Pakistan for not doing enough against Haqqani network

ఉగ్రవాద నిరోధం కోసం వెచ్చించాల్సిన నిధులను పాకిస్తాన్ సరైన రీతిలో వినియోగించడం లేదన్న యూఎస్ స్టేట్ సెక్రటరీ జిమ్ మాటీస్ సూచన మేరకే నిధుల నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిధుల నిలుపుదలకు సంబంధించి మాటీస్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయన్నారు.

గ్లోబల్ టెర్రరిజం అనే అంశంపై నివేదికను అందుకున్న యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్.. కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాక్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

English summary
The US has decided against disbursement of $350 million in coalition support fund to Pakistan+ after defence secretary James Mattis informed Congress that he was not able to certify that Islamabad has taken "sufficient actions" against the dreaded Haqqani network, a top official said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X